Homeఎంటర్టైన్మెంట్Renu Desai - Johnny Master: వదిన అని పిలిచినందుకు జానీ మాస్టర్ కి వార్నింగ్...

Renu Desai – Johnny Master: వదిన అని పిలిచినందుకు జానీ మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్..వీడియో వైరల్!

Renu Desai – Johnny Master: సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీలతో ఒకరు రేణు దేశాయ్(Renu Desai). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాజీ భార్య గా ఈమెకు ఉన్న పాపులారిటీ మామూలుది కాదు. సోషల్ మీడియా లో ట్రోల్స్ ని పట్టించుకోని సెలబ్రిటీలు ఉంటారు, అదే విధంగా సోషల్ మీడియా ట్రోల్స్ ని మనసుకి తీసుకునే సెలబ్రిటీలు కూడా ఉంటారు. రేణు దేశాయ్ రెండవ క్యాటగిరీ కి సంబంధించిన మనిషి. ఒకప్పుడు ఈమె ట్విట్టర్ లో ఉండేది, కానీ అక్కడి నెగిటివిటీ ని తట్టుకోలేక ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేసింది. కానీ ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఈమె అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇది కాసేపు పక్కన పెడితే రేణు దేశాయ్ ని చూడగానే పవన్ కళ్యాణ్ అభిమానులకు గుర్తొచ్చే పదం వదిన. ఇప్పటికీ ఆమెని వదిన అనే సంబోధిస్తూ ఉంటారు.

కానీ ఈ పిలుపు ఆమెకు అసలు నచ్చదు. అభిమానులు అలా పిలిచినందుకు ఎన్నో సార్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫైర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కూడా నేను వదిన ఎలా అవుతాను, పిలిస్తే అక్కా అని పిలవండి, లేదంటే రేణు దేశాయ్ అని పిలవండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. కేవలం అభిమానులకు మాత్రమే కాదు , సినీ సెలబ్రిటీలకు కూడా ఈమె వార్నింగ్ ఇస్తుందని రీసెంట్ గానే తెలిసింది. ఒక ఈవెంట్ కి హాజరైన రేణు దేశాయ్, అదే ఈవెంట్ కి వచ్చిన జానీ మాస్టర్ తో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. జానీ మాస్టర్ ముందుగా ఈవెంట్ కి వచ్చి, అక్కడ ఉన్న యాంకర్ అనసూయ ని పలకరిస్తాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న రేణు దేశాయ్ ని చూసి ‘వదిన..హాయ్’ అని అంటాడు.

అప్పుడు రేణు దేశాయ్ ‘వదిన కాదు..అక్కా..ఎన్ని సార్లు చెప్పాలి రా నీకు’ అని అంటుంది. అప్పుడు జానీ మాస్టర్ ‘పొరపాటున నోటి నుండి వచ్చేసింది’ అని అంటాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. అయితే రేణు దేశాయ్ ఎంత చెప్పినా, అభిమానుల నుండి సహజంగానే వదిన అని వచ్చేస్తుంది. దానికి ఆమె ప్రతీసారీ ఇలా చెప్పాల్సిన అవసరం లేదు , చూసి చూడనట్టు పట్టించుకోకుండా వదిలేస్తే మంచిది అంటూ సిసిల మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Chilll_Vibes (@chilll_vibes_)

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular