Taj Mahal basement rooms: ప్రపంచంలోని అందమైన కట్టడాల్లో తాజ్ మహల్ కూడా ఉంది. ఈ భవనాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి తరలివస్తూ ఉంటారు. షాజహాన్ అనే రాజు తన ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించారని కొందరు అంటూ ఉంటారు. తాజ్ మహల్ కు వెళ్లినవారు అందమైన అనుభూతిని పొందుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ కట్టడా నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించుకుంటారు. తెల్లని పాల రాతి తో నిర్మించిన ఈ కట్టడం ఒక సమాధి అని తెలుస్తోంది. అయితే తాజ్ మహల్ విషయంలో దేశవ్యాప్తంగా నిత్యం చర్చ ఉంటుంది. ఇది ఒకప్పుడు శివాలయం అని.. దానిని కూల్చేసి తాజ్ మహల్ నిర్మించారని హిందువులు అంటుండగా.. అలాంటిది ఏమీ లేదని మిగతావారు అంటున్నారు. అంతేకాకుండా తాజ్ మహల్ కట్టడం కింద 22 రహస్యకాదులు ఉన్నాయని.. అందులో ఏదో దాగి ఉందని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అందులో ఏమున్నాయి అంటే?
యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్ కట్టడం ఎటు నుంచి చూసినా అందంగానే కనిపిస్తుంది. ఈ కట్టడాన్ని షాజహాన్ అనే రాజు ముంతాజ్ కోసం నిర్మించారని చరిత్ర తెలుపుతోంది. అయితే తాజ్ మహల్ బేస్మెంట్ కింద 22 రహస్య గదిలో ఉన్నాయని.. ఇందులో హిందూ దేవతల విగ్రహాలు, బొమ్మలు ఉన్నాయని చర్చ సాగుతోంది. అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ గదులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది. భద్రత కారణాలవల్ల వీటిని మూసివేసి ఉంచుతోంది. తాజ్ మహల్ బేస్మెంట్ కింద 22 గదులు ఉన్నాయన్న ఆరోపణలపై కొందరు అధికారులు పరిశీలించగా.. అందులో ఎలాంటి విగ్రహాలు లేవని తేల్చారు.. అంతేకాకుండా 2022 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు లో కొందరు వేసిన పిటిషన్ల ప్రకారం తాజ్ మహల్ కట్టడం కింద దేవాలయం ఉందని.. దానిని కూల్చేసి సమాధిని నిర్మించారన్న పిటిషన్ ను కొట్టేసింది. ఆ తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు 22 గదులకు సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు. ఇందులో ఎలాంటి రహస్యాలు లేవని.. ఇందులో హిందూ విగ్రహాలు ఉన్నాయన్న ఆరోపణలు కొట్టివేసింది.
వాస్తవానికి 1978 వరకు ఈ రహస్య గదుల్లోనూ ప్రజలు సందర్శించారు. కానీ ఆ తర్వాత భద్రతా దృష్ట్యా వీటిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ గదులు వేసవి వేడి నుంచి ఆశ్రయం కోసం ఉద్దేశించి నిర్మించారని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇవి గదులు కావని, సమాధి నేలమాలికలో తలుపులు చేయబడిన పొడవాటి పంపు గల కారిడారని అధికారులు తేల్చారు. అయితే కొందరు హిందుత్వ వాదులు మాత్రం ఇప్పటికీ ఈ కట్టడం కింద ఏవో ఉన్నాయి అంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా తాజ్ మహల్ భారతదేశానికి అందాన్ని ఇచ్చే కట్టడం అని పేర్కొంటారు.