spot_img
Homeఎంటర్టైన్మెంట్Deepika Padukone: కల్కి చిత్రానికి దీపికా పదుకొనె రెమ్యూనరేషన్... కొత్త రికార్డు సెట్ చేసిన బాలీవుడ్...

Deepika Padukone: కల్కి చిత్రానికి దీపికా పదుకొనె రెమ్యూనరేషన్… కొత్త రికార్డు సెట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

Deepika Padukone: బాలీవుడ్ భామ దీపికా పదుకొనె రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. కల్కి 2829 AD చిత్రానికి ఆమె రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. కల్కి సైన్స్ ఫిక్షన్ మూవీ. ప్రభాస్ ఫస్ట్ టైం ఈ జోనర్ లో మూవీ చేస్తున్నారు. కల్కి మూవీలో భారీ క్యాస్ట్ నటిస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, దిశా పటాని భాగమయ్యారు. కల్కి చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 600 కోట్లు. సీ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

కల్కి చిత్రంలో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనే నటిస్తుంది. ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. లేడీ వారియర్ గెటప్ లో ఆమె అద్భుతంగా ఉన్నారు. కాగా కల్కి చిత్రానికి దీపికా పదుకొనె భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారట. రూ. 20 కోట్లు ఆమె డిమాండ్ చేశారని సమాచారం. కల్కి నిర్మాతలు దీపికా పదుకొనె అడిగిన మొత్తం ఇచ్చారట. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా దీపికా పదుకొనె ఉన్నారు.

సాధారణంగా ఆమె సినిమాకు రూ. 12 నుండి 15 కోట్లు తీసుకుంటారట. అయితే కల్కి మూవీకి ఎక్కువ ఛార్జ్ చేశారట. కాల్ షీట్స్ పెద్ద మొత్తంలో కేటాయించిన దీపికా పదుకొనె ఇరవై కోట్లు అడిగారని తెలుస్తుంది. మిగతా హీరోయిన్స్ తీసుకునే దానికి ఇది నాలుగైదు రెట్లు ఎక్కువ. రష్మిక మందాన, సమంత, కత్రినా కైఫ్ వంటి స్టార్స్ కేవలం రూ. 4 నుండి 5 కోట్లు తీసుకుంటున్నారు. కాబట్టి హీరోలకు సమానంగా దీపికా పదుకొనె డిమాండ్ చేస్తున్నారన్న మాట.

మరోవైపు దీపికా పదుకొనె అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారనే వాదన ఉంది. హైదరాబాద్ లో కల్కి షూటింగ్ జరుగుతుండగా ఆమె కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె షూటింగ్ సరిగా చేయలేకపోతున్నారనే పుకార్లను యూనిట్ ఆ మధ్య ఖండించారు. ఒకప్పుడు రన్బీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన దీపికా పదుకొనె అతడితో బ్రేకప్ అయ్యాక డిప్రెషన్ కి గురైంది. అనంతరం రణ్వీర్ సింగ్ ని వివాహం చేసుకుంది.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version