Tollywood Remake Movies: మన తెలుగు హీరోలకి భారీ హిట్ ని అందించిన రీమేక్ సినిమాలు

రీమేక్ సినిమాలతో హిట్లు కొట్టిన హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

Written By: Swathi, Updated On : August 7, 2023 11:33 am

Tollywood Remake Movies

Follow us on

Tollywood Remake Movies: ఈ సినిమాని మనం వేరే భాషలో చూసేసాం కదా ఇంక మళ్లీ మన భాషలో ఏమి చూస్తాం అనుకునే వాళ్ళు కొందరు, ఈ సినిమాని మన భాషలో ఎలా తీశాడో, మన హీరో ఎలా చేశారో చూద్దాం అనుకునే వాళ్ళు మరికొందరు, ‌ ఇంకొందరేమో అసలు వేరే భాషలో సూపర్ హిట్ అయినా చిత్రాలను చూడకుండా మన భాషలోనే రీమేక్ చేశాక చూద్దాం అనుకునేవాళ్ళు. మరి ఇన్ని భిన్నాభిప్రాయాలు ఉన్న ప్రేక్షకులు ఉన్నప్పటికీ ధైర్యం తో రీమేక్ సినిమాలు చేసి భారీ హిట్లు సొంతం చేసుకున్న మన హీరోలు, ఆ సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం..

దృశ్యం

వెంకటేష్ హీరోగా చేసిన దృశ్యం సినిమా ఎంత విజయం సాధించిందో మన అందరికీ తెలుసు. ఈ సినిమా సీక్వెల్ కూడా కరోనా టైం లో ఓటీటీ లో రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ అందుకుంది. ఎక్కువగా రీమేక్ సినిమాలకు ఇష్టం చూపించే వెంకటేష్ తీసిన దృశ్యం సినిమా కూడా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమాకు రీమేకే. మీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది.

అంతేకాదు వెంకటేష్ నటించిన ఎన్నో సినిమాలు రీమేక్ గా వచ్చినవే, వాటిల్లో ముఖ్యంగా గురు, నారప్ప, ఘర్షణ, రాజా, సూర్యవంశం , చంటి లాంటి సినిమాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచి వెంకటేష్ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెతాయి.

ప్రేమమ్

నాగచైతన్య కెరియర్ లో ఉన్న మంచి లవ్ స్టోరీ సినిమాలలో ప్రేమమ్ ఒకటి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్’ ను అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. అనుపమ పరమేశ్వరన్, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. చందూ మొండేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

ఓ బేబీ

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుని ఒక మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఖుషి.. గబ్బర్ సింగ్…

రీమేక్ సినిమాలతో హిట్లు కొట్టిన హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆయన కెరీర్ లో అత్యంత బిగ్ బ్లాక్ బస్టర్స్ ఖుషి,‌ గబ్బర్ సింగ్ కూడా రీమేక్ లే. ఖుషి సినిమా తమిళంలో వచ్చిన విజయ్ ఖుషి సినిమాకి రీమేక్ కాగా, గబ్బర్ సింగ్ హిందీ లో వచ్చిన సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాకి రీమేక్. ఈ రెండు సినిమాలు కూడా మన తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎంతటి రికార్డులు సృష్టించాయొ మన అందరికీ తెలుసు.

ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’ కూడా బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ‘పింక్’కు రీమేక్‌గా రూపొంది. ఈ చిత్రాన్ని హిందీలో అమితాబచ్చన్ చేయగా తెలుగులో పవన్ కళ్యాణ్ చేసి, రీమేక్ తో వచ్చిన మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం తరువాత వచ్చిన భీమ్లా నాయక్ అలానే ఈ మధ్య విడుదలైన బ్రో సినిమాలో కూడా రీమిక్ సినిమాలే. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కెరియర్ లో మంచి హిట్లుగా నిలిచాయి.