Dhurandhar Rehman Dakait Residence: రీసెంట్ గా బాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ విడుదలై వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం, యదార్ధ సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు అనే విషయం తెలిసిందే. పాకిస్తాన్ దేశం లో ఉగ్రవాదాన్ని అక్కడి నాయకులు ఎలా పెంచి పోషిస్తున్నారు అనేది చాలా ఆసక్తికర్తంగా చూపించారు. అంతే కాకుండా అక్కడి రాజకీయ వాతావరణం కూడా ఎలా ఉంటుందో చూపించారు. పాకిస్తాన్ కి వెళ్లి షూటింగ్ చేయలేదు. కానీ ప్రతీ సన్నివేశం పాకిస్తాన్ లో ఉన్నట్టుగానే ఉంటుంది. అంత రియలిస్టిక్ గా చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో రెహ్మాన్ డకాయిట్ గా నటించిన అక్షయ్ ఖన్నా కి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విధంగా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఆయన కూడా ఆ పాత్ర కూడా ఒకటి అని చెప్పొచ్చు.
అయితే నిజ జీవితం రెహ్మాన్ నివాసం అమృత్ సర్ లో ఉంది. పూర్తిగా ఎరుపు రంగులో ఉన్న ఈ భవనాన్ని ‘లాల్ కోటి’ అని పిలుస్తారు. ‘ధురంధర్’ లో ‘రెహ్మాన్ బెలోచ్’ పాటలో ఈ భవనాన్ని మనం చూడొచ్చు. ఆ చిత్రం లోని అనేక సన్నివేశాల్లో ఈ భవనాన్ని చూడొచ్చు. ‘ధురంధర్’ చిత్రానికి ముందు కూడా ఇక్కడ అనేక సినిమాల షూటింగ్స్ ని చేశారు. ఈ భవనానికి 150 ఏళ్ళ చరిత్ర ఉంది. 1977 వ సంవత్సరం లో అశోక్ కుమార్ మెహ్రా నుండి గాంధీ ఆశ్రమం ఆర్గనైజేషన్ కొనుగోలు చేసింది. అప్పట్లో ఈ ‘లాల్ కోటి’ భవనం ధర 7 లక్షల రూపాయిలు. కేవలం సినిమా షూటింగ్స్ కి మాత్రమే కాదు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కి కూడా ఈ భవనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు.
అంతే కాదు ఈ భవనం లో మద్యం నిషేధం, ఎలాంటి మత్తు పదార్దాలు కూడా తీసుకొని వెళ్ళకూడదు అట. ఈ భవనం గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది వీడియో లో చూడండి. ఇకపోతే ఈ సినిమా రీసెంట్ గానే హిందీ లో ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని దాటి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈమధ్య కాలం లో ఒక బాలీవుడ్ సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం ఎప్పుడూ జరగలేదు. ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ మార్కు ని అందుకున్న ప్రతీ సినిమా అన్ని భాషలకు కలుపుకొని వచ్చింది. కానీ ఇలా కేవలం ఒకే ఒక్క భాష నుండి వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు.
