Red, White And Royal Blue: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త చిత్రం రెడ్, వైట్ & రాయల్ బ్లూ. నిజానికి ఇది ఒక నవల నుంచి మూవీ గా కన్వర్ట్ చేసిన స్టోరీ.రెడ్, వైట్ & రాయల్ బ్లూ అనే టైటిల్ తో కేసీ మెక్‌క్విస్టన్ రాసిన హిట్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. ఇది ఒక ప్రేమ కథ చిత్రం.. అలా అని అమ్మాయి అబ్బాయి మధ్య అనుకునేరేమో. ఇది బ్రిటిష్ రాజు మనవడు, యుఎస్ ప్రెసిడెంట్ కొడుకు
మధ్య ఏర్పడే ఒక వినూత్నమైన ప్రేమ కథ.
మిడిల్ ఏజ్ పర్సన్స్ కి ఈ మూవీ స్టార్టింగ్ లో పెద్దగా నచ్చకపోవచ్చు. మరి ఇందులో ఉన్న కాన్సెప్ట్ అలాంటిది. అబ్బాయి అబ్బాయిని ప్రేమించుకొని.. ముద్దులు పెట్టుకోవడం సడన్గా చూస్తే ఎవరికైనా ఏదోలా ఉంటుంది కదా. కానీ ఒక్కసారి స్టోరీ మొదలై ఫ్లాట్ తో కనెక్ట్ అయితే ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్నటువంటి సంఘర్షణ, వాళ్లు జీవితంలో అనుభవిస్తున్న బాధ, ఒకరితో ఒకరికి ఏర్పడిన అనుబంధం అర్థం అవుతాయి. అప్పుడు స్టోరీ పెద్ద ఇబ్బందికరంగా అనిపించదు.
మాథ్యూ లోపెజ్ దర్శకత్వ బాధ్యతలు వహించిన ఈ అమెరికన్ కామెడీ రొమాంటిక్ మూవీ లో టేలర్ జఖర్ పెరెజ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎల్లెన్ క్లార్‌మాంట్ కొడుకుగా నటించగా, నికోలస్ గలిట్జైన్ బ్రిటీష్ రాయల్టీకి చెందిన ప్రిన్స్ హెన్రీగా కనిపిస్తారు. ఈ మూవీలో ఒక రాజ కుటుంబంలో ఉన్న వ్యక్తి జీవితం నిజానికి ఎలా ఉంటుంది, సొసైటీకి ఆదర్శంగా ఉండడం కోసం అతను ఎంత శాక్రిఫైజ్ చేయాల్సి వస్తుంది అనే విషయాలు బాగా ఎలివేట్ చేశారు. మరోపక్క ప్రెసిడెంట్ కొడుకు గా ఉండడం అనుకున్నంత ఈజీ కాదు అనేది కూడా చూపించారు.
ఒకపక్క అమెరికా ఇంకో పక్క బ్రిటన్.. భిన్నాభిప్రాయాలతో ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ఏం జరుగుతుంది అనే విషయం మూవీలో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక చిన్న ఫ్యాన్సీ ఈవెంట్లో చోటు చేసుకున్న సంఘటన తరువాత ఏర్పడినటువంటి రాజకీయ ఉద్రిక్తత మధ్య ఈ ఇద్దరు యువకుల రిలేషన్షిప్ అభివృద్ధి చెందుతుంది. ఇదే స్టోరీ అబ్బాయి ..అబ్బాయి మధ్య కాకుండా అమ్మాయి..అబ్బాయి మధ్య అయ్యుంటే మాత్రం మన ఇండియన్స్ కు బాగా నచ్చి ఉండేదేమో. కానీ ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ సినిమాకు ఆదరణ పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే వాళ్లు ఇందులో ఉన్నటువంటి పాత్రల కంటే కూడా పాత్రల మధ్య ఉన్నటువంటి భావోద్వేగానికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు.