https://oktelugu.com/

Junior NTR: ఎన్టీఆర్ ఫ్రస్ట్రేషన్ కి కారణం… తాత సమాధి వద్ద వింత ప్రవర్తన!

దీన్ని సాకుగా చూపుతూ జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఎన్టీఆర్ ని ఓ వర్గం కార్నర్ చేసింది. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని దూషిస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ పడుతున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు.

Written By: , Updated On : May 29, 2023 / 10:22 AM IST
Junior NTR

Junior NTR

Follow us on

Junior NTR: నందమూరి కుటుంబంలో ఉన్న విబేధాలు తారా స్థాయికి చేరాయి. బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడం అంతర్గత యుద్ధానికి దారి తీసింది. జూనియర్ ఎన్టీఆర్ ని తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మే 20న హైదరాబాద్ వేదికగా జరిగిన ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేను అన్నారు. పుట్టిన రోజు నేపథ్యంలో ముందుగా అనుకున్న కార్యక్రమాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

దీన్ని సాకుగా చూపుతూ జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఎన్టీఆర్ ని ఓ వర్గం కార్నర్ చేసింది. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని దూషిస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ పడుతున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. ఎన్టీఆర్ ని డిపెండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు. ఎన్టీఆర్ జోలికి వస్తే ఊరుకునేది లేదంటున్నారు. ఎన్టీఆర్ పై అనుచిత కామెంట్స్ చేస్తున్న బాలకృష్ణ, నారా చంద్రబాబు వర్గంపై ఎదురుదాడికి దిగుతున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉన్న ఆగ్రహాన్ని సీనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్యాన్స్ చూపించారు. బాలయ్య నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. సీఎం ఎన్టీఆర్ అంటూ కేకలు వేశారు. ఈ పరిణామం బాలయ్యకు కాలేలా చేసింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ఆయన కొంచెం వింతగా ప్రవర్తించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద ఓ వ్యక్తి పుష్ప గుచ్ఛం ఇస్తుంటే.. పక్కకు నెట్టివేశాడు. గులాబీ పూల రేకులు సమాధి మీద చల్లారు. ఎంటర్ ముఖంలో సీరియస్ నెస్ కనిపిస్తుంది.

ఎన్టీఆర్ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్-బాలయ్య మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన ఫ్యాన్స్ నారా చంద్రబాబు నాయుడు, బాలయ్యలను ఇబ్బంది పెడుతున్నారు. టీడీపీలో ఎన్టీఆర్ వర్గం అనేది ఒకటి తయారైంది. కొందరు నేతలు కూడా ఎన్టీఆర్ కి మద్దతుగా ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీలోని ఎన్టీఆర్ సానుభూతిపరుల్లో ఆయన్ని చెడ్డగా చేయాలనేది బాలయ్య, బాబు ప్రణాళిక అనేది కొందరి వాదన.