Amaravalli Flowers: ప్రకృతి ఓ అనంతం.. అనేక వింతలు విశేషాలకు నెలవు. ఎంత పరిశోధించినా.. ఎంత తెలుసుకున్నా తక్కువే. ఆకలు, అలములు.. పూలు పండ్లు.. పక్షులు, జంతువులు.. క్రిములు, కీటకాలు.. జలాలు.. జీవరాశులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అన్నీ ప్రకృతిలో భాగమే. ప్రతీ జీవకోటి ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తోంది. ఈ ప్రకృతిలో కోటాను కోట్ల వృక్ష జాతులు ఉన్నాయి. నేల, వాతావరణ పరిస్థితుల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల మొక్కలు, వృక్షాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ అరుదైన మొక్క ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమొక్క పూసే పూలు పక్షిని పోలి ఉండడమే దాని ప్రత్యేకత.
అమరవల్లీ..
పక్షిని పోలిన పూలు పూసే ఆ మొక్కపేరు అమరవల్లి. దూరం నుంచి చూస్తే పక్షులు మొక్కపై కూర్చున్న›అనుభూతి మనకు కలుగుతుంది. పక్షలని దగ్గరకు వెళ్లి చూస్తే.. పువ్వులుగా కనిపిస్తాయి.. అలా భ్రమింపజేస్తుంది అమరవల్లి. ఈ మొక్క ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లిల్లీ జాతి మొక్కే..
అనేక సంవత్సరాలుగా వృక్షశాస్త్రజ్ఞుల లిల్లిజాతి మొక్కలను గుర్తించారు. అందులో ఒకరకమైన మొక్క అమరవల్లి అని అంటున్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాప్రికాలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుందట. అక్కడి వాతావరణ పరిస్థితులు అమరవల్లికి అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఏటా శీతాకాలంలో మాత్రమే పుష్పిస్తుంది.
వివిధ పేర్లతో..
అమరిల్లిస్ జాతికి చెందిన మొక్కలను బెల్లడోన్నా లిల్లీ, జెర్సీ లిల్లీ, నేకెడ్ లేడీ, అమరిల్లో అని పిలుస్తారట. దక్షిణ ఆస్ట్రేలియాలో ఈస్టర్ లిల్లీ అని అంటారు. పువ్వుల ఆకారం, పెరుగుదల కారణంగా ‘లిల్లీ’ అనే సాధారణ పేరు కలిగిన అనేక జాతులలో ఇది ఒకటని శాస్త్రవేత్తలు అంటుఆ్నరు.
అమరిల్లీస్ అంటే ప్రేమ, అందం..
ఇక అమరిల్లీస్ అంటే విక్టోరియన్ భాషలో ప్రేమ, అందం అని అర్థం. పేరుకు తగినట్లే.. ప్రేమను పంచే పక్షిలా కనిపించే పూలు.. దగ్గరకు వెళ్లి చూస్తే అందమైన పుష్పాలు అందుకేనేమో ఈ మొక్కకు అమరిల్లీ అని పేరు పెట్టారనిపిస్తుంది. సంకల్పం, ఆశ అనే అర్థాలు కూడా అమరిల్లీస్‌కు ఉంటాయట.