https://oktelugu.com/

Naresh Malli Pelli Movie: మళ్ళీ పెళ్లి సూపర్ స్టార్ కృష్ణకు అంకితం… నరేష్ ఏం మాట్లాడుతున్నాడు!

నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ కారణంగా కృష్ణ ఫ్యామిలీని కూడా మూడో భార్య రమ్య రఘుపతి వివాదంలోకి లాగింది. కృష్ణ, విజయ నిర్మల పేర్లు బయటకు తీసింది. నరేష్ తనకు కృష్ణతో ఎఫైర్ అంటగట్టడాని ఆమె చెప్పడం దారుణ పరిణామం. నరేష్ వలన కృష్ణ ఫ్యామిలీ పరువు రోడ్డున పడుతుందనే ఓ వాదన ఉంది. నరేష్ మాత్రం పవిత్రతో ఎఫైర్ ని కృష్ణ, మహేష్ ఒప్ప్పుకున్నారని చెప్పుకొచ్చారు. పవిత్ర లోకేష్ చేతి వంట అంటే కృష్ణకు ఏంతో ఇష్టం అని చెప్పారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 29, 2023 / 09:55 AM IST

    Naresh Malli Pelli Movie

    Follow us on

    Naresh Malli Pelli Movie: నరేష్ తో మాకు సంబంధం లేదని ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు అన్నారు. అసలు నరేశ్ ఎవరు? మా ఫ్యామిలీ వేరు అన్నట్లు ఆయన మాట్లాడారు. కృష్ణను అనాథలా వదిలేశారని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని ఆదిశేషగిరిరావును అడగ్గా… అసలు నరేష్ ఎవరు? మా కుటుంబ సభ్యులం అక్కడే ఉన్నాం అన్నారు. ఆయన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదే సమయంలో ఆదిశేషగిరిరావు నరేష్ ని అసలు ఇష్టపడరని అర్థమైంది.

    ఈ క్రమంలో నరేష్ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రాన్ని కృష్ణకు అంకితం చేస్తున్నానని చెప్పడం సంచలనంగా మారింది. మళ్ళీ పెళ్లి నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో కృష్ణ , విజయనిర్మల పాత్రలు కూడా ఉన్నాయి. మళ్ళీ పెళ్లి సక్సెస్ మీట్లో నరేష్ ఈ చిత్రాన్ని కృష్ణకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

    నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ కారణంగా కృష్ణ ఫ్యామిలీని కూడా మూడో భార్య రమ్య రఘుపతి వివాదంలోకి లాగింది. కృష్ణ, విజయ నిర్మల పేర్లు బయటకు తీసింది. నరేష్ తనకు కృష్ణతో ఎఫైర్ అంటగట్టడాని ఆమె చెప్పడం దారుణ పరిణామం. నరేష్ వలన కృష్ణ ఫ్యామిలీ పరువు రోడ్డున పడుతుందనే ఓ వాదన ఉంది. నరేష్ మాత్రం పవిత్రతో ఎఫైర్ ని కృష్ణ, మహేష్ ఒప్ప్పుకున్నారని చెప్పుకొచ్చారు. పవిత్ర లోకేష్ చేతి వంట అంటే కృష్ణకు ఏంతో ఇష్టం అని చెప్పారు.

    కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నరేష్ ఓ మాటన్నారు. పవిత్రతో ఎఫైర్ పెట్టుకోవడానికి కృష్ణ-విజయ నిర్మల స్ఫూర్తి అన్నారు. ఇవన్నీ గమనిస్తుంటే నరేష్-మహేష్ ఫ్యామిలీ మధ్య దూరం ఉన్నట్లు అర్థం అవుతుంది. అయితే కృష్ణ నరేష్ వద్దే ఉన్నారని సమాచారం. విజయ నిర్మల-కృష్ణ విడిగా ఉండేవారు కాదు. విజయనిర్మల నరేష్ వద్దే ఉండేది. దాంతో కృష్ణ కూడా స్టెప్ సన్ నరేష్ వద్దే ఉండేవారు. అందుకే కృష్ణ పార్థీవ దేహం వద్ద నరేష్-పవిత్ర లోకేష్ అన్నీ తామై వ్యవహరించారు.