Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసుతో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. నిజానికి సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం గా భావించి ప్రతి ఒక్కరి కష్టాలను అడిగి తెలుసుకొని మరి, వాళ్ళకి ఎంతో కొంత సహయం చేయడంలో చిరంజీవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు.
తను మాత్రమే కాకుండా తన కో యాక్టర్స్ తో కూడా కొంతమందికి హెల్ప్ చేయించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ‘బామ్మ మాట బంగారు బాట’ అనే సినిమా లో భాగంగా ది గ్రేట్ లెజెండరీ ఆర్టిస్ట్ అయిన నూతన ప్రసాద్ గారు ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆయన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఇక అప్పటి నుంచి ఆయన నిలబడి నడవ లేకుండా అయిపోయాడు. దాంతో ఆయన వీల్ చైర్ కే పరిమితమయ్యాడు. ఇక ఇలాంటి నూతన ప్రసాద్ కి ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆయనని సినిమాలో తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు.
కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి తనకి కొంత సహాయమైతే చేశాడు. అలాగే తన సినిమాల్లో ఏవైనా క్యారెక్టర్లు ఉంటే వాటిని ఆయన చేత చేయించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండేవాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మాస్టర్ సినిమాలో ఒక క్యాంటీన్ ఓనర్ గా తన చేత నటింపజేశాడు. ఆయన వీలైనన్ని ఎక్కువ సీన్లలో కనిపించేలా కూడా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుని ఆయన చేత ఆ క్యారెక్టర్ చేయించాడు. తను ఖాళీగా ఉంటే ఎప్పుడూ ఇబ్బంది పడతాడు, బాధపడతాడనే ఉద్దేశ్యంతో తనని ఎప్పటికప్పుడు బిజీగా ఉంచే ప్రయత్నం అయితే చేశాడు.
అలా చిరంజీవి తన సమకాల నటుడు అయిన నూతన ప్రసాద్ ను కొంతవరకైతే ఆదుకున్నాడనే చెప్పాలి. ఇక మాస్టర్ సినిమాలో ఆయన నటన చూసిన కొంతమంది ఆయనకి వీల్ చైర్ లో కూర్చునే క్యారెక్టర్లు ఇచ్చి అతన్ని ప్రోత్సహించారు. అలాగే ఆ తర్వాత నేరాలు-ఘోరాలు ప్రోగ్రామ్ కి కూడా తన వాయిస్ ఇచ్చి చాలా ఫేమస్ కూడా అయ్యాడు…