Megastar Chiranjeevi Godfather: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేశాడు. ఫస్ట్ షో నుండి ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవర్ ఫుల్ పాత్రలో వింటేజ్ చిరును గుర్తు చేశారని సంబరాలు చేసుకుంటున్నారు. క్రిటిక్స్ గాడ్ ఫాదర్ చిత్రానికి మంచి రేటింగ్ ఇచ్చారు. ప్రేక్షకులు ఆద్యంతం గాడ్ ఫాదర్ మూవీని ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్స్ సైతం గాడ్ ఫాదర్ మూవీపై తమ రివ్యూ ఇచ్చారు.
మరి గాడ్ ఫాదర్ గురించి టాలీవుడ్ ప్రముఖుల రివ్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం… గాడ్ ఫాదర్ చిత్రానికి సంగీతం అందించిన థమన్ వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు. ఒక్క మాటలో సినిమా ఎలా ఉందో తేల్చేశాడు. ‘ఇది బ్లాక్ బస్టర్ కాదు బాస్ బస్టర్’ అని చిరంజీవి రాయల్ లుక్ షేర్ చేశారు. సినిమా అద్భుతమని సింపుల్ గా తేల్చేశాడు. ఇక దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవి తన నటనతో థియేటర్స్ కి పండగ కళ తీసుకొచ్చారన్నారు. చిరంజీవిని స్వయంగా కలిసి సక్సెస్ విషెస్ చెప్పిన మెహర్, ఆయనతో దిగిన ఫోటో షేర్ చేశాడు.
Also Read: The Ghost Review: ‘ది ఘోస్ట్ ‘ మూవీ రివ్యూ
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గాడ్ ఫాదర్ మూవీపై తనదైన రివ్యూ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ చిత్రాన్ని మెగాస్టార్ మెగా బ్లాక్ బస్టర్ గా అభివర్ణించాడు. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ నేపథ్యంలో థియేటర్ లో సినిమా ఎప్పుడు చూస్తానా అని ఆత్రుత వ్యక్తం చేశారు. నిఖిల్ తో పాటు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. క్లాస్ వెర్షన్ ఆఫ్ చిరంజీవి మాస్ అప్పీరెన్స్ అదిరింది అన్నారు. దర్శకుడు మోహన్ రాజాకు, గాడ్ ఫాదర్ యూనిట్ కి సక్సెస్ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
హీరో శ్రీకాంత్ గాడ్ ఫాదర్ చిత్రంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. గాడ్ ఫాదర్ చిత్రం బ్లాక్ బస్టర్ అంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. మూవీ విజయం నేపథ్యంలో చిరంజీవి అన్నయ్యకు టీంకి బెస్ట్ విషెస్ ని ఆయన ట్వీట్ చేశారు. స్టార్ రైటర్ గోపి మోహన్ కూడా గాడ్ ఫాదర్ మూవీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. గాడ్ ఫాదర్ టీం కి కంగ్రాట్స్. చిరంజీవి రాకింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. జైలు సీన్ అయితే అదిరిపోయింది. దర్శకుడు మోహన్ రాజా శ్రద్దతో పని చేసి బెటర్ అవుట్ ఫుట్ ఇచ్చారు. సత్యదేవ్, నయనతార బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు, అని కామెంట్ చేశారు. అలాగే పలువురు ప్రముఖులు గాడ్ ఫాదర్ పై పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.
https://twitter.com/MusicThaman/status/1577842715823206400
https://twitter.com/MeherRamesh/status/1577687093437792257
https://twitter.com/actor_Nikhil/status/1577609252226547714
Boss comes with a Bang fantastic portrayal of Class version of @KChiruTweets with Mass Presentation kudos to @jayam_mohanraja & team for the success of #GodFather pic.twitter.com/GbaFzItVWa
— Harish Shankar .S (@harish2you) October 5, 2022
https://twitter.com/actorsrikanth/status/1577511309666836481
https://twitter.com/Gopimohan/status/1577646010679296001