Godfather Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయినప్పటికీ అది మెగాస్టార్ రేంజ్ కాదనే చెప్పాలి..దానికి కారణం ఈ సినిమా విడుదల రోజే అక్కినేని నాగార్జున ఘోస్ట్ మరియు బెల్లం కొండా గణేష్ ‘స్వాతి ముత్యం’ సినిమాలు విడుదలయ్యాయి..ఈ రెండు సినిమాలు చిరంజీవి గారి సినిమాతో పోటీ పడేంత కెపాసిటీ లేని సినిమాలే అయినా కూడా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన సినిమాలు కావడం తో థియేటర్స్ ని బాగా హోల్డ్ చేసుకోగలిగారు..అందుకే ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా మెగాస్టార్ రేంజ్ నంబర్స్ కనపడలేదు..ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ప్రాంతం షేర్ కలెక్షన్స్
నైజం 3.29 కోట్లు
సీడెడ్ 3.18 కోట్లు
ఉత్తరాంధ్ర 1.26 కోట్లు
ఈస్ట్ 1.60 కోట్లు
వెస్ట్ 60 లక్షలు
నెల్లూరు 57 లక్షలు
గుంటూరు 1.75 కోట్లు
కృష్ణ 73 లక్షలు
మొత్తం 13 కోట్లు
ఓవర్సీస్ 2 కోట్లు
కర్ణాటక 1.8 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 60 లక్షలు
వరల్డ్ వైడ్ 18 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి గారి గత చిత్రం ఆచార్య పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా దానికి మొదటి రోజు కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుండే 29 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..కానీ గాడ్ ఫాదర్ సినిమాకి అందులో 50 శాతం కూడా రాలేదు..దానికి కారణం తక్కువ థియేటర్స్ లో విడుదల అవ్వడమే కాదు..అతి తక్కువ టికెట్ రేట్స్ కూడా..నైజం వంటి ప్రాంతాలలో చిరంజీవి రేంజ్ స్టార్ హీరో కి కేవలం హైదరాబాద్ సిటీ లోనే 800 షోస్ పడుతాయి.
కానీ గాఢ ఫాదర్ సినిమాకి కేవలం 400 షోలు మాత్రమే పడ్డాయి..అదే రోజు నాగార్జున గారి సినిమా ఘోస్ట్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ వారి స్వాతి ముత్యం సినిమాలు విడుదల కాకపొయ్యి ఉంటె 800 షోస్ కచ్చితంగా పడేవి..అప్పుడు ఓపెనింగ్ కూడా చాలా గట్టిగా ఉండేది..పోనీ ఒకే రోజు విడుదలై ఆ రెండు సినిమాలకు ఏమైనా గొప్ప ఓపెనింగ్ వచ్చిందా అంటే అది కూడా లేదు..చిరంజీవి గారి టైం బాడ్ అనుకోవాల్సిందే..కానీ గాడ్ ఫాదర్ రెండవ రోజు కలెక్షన్స్ కూడా అదరగొట్టేసింది..కలెక్షన్స్ ఫుల్ రన్ లో ఎక్కడ వరుకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
Also Read:T20 World Cup 2022- Team India: ఆల్ ది బెస్ట్ టీమిండియా.. ఈసారైనా కప్ తో రావాలే! సాధ్యమేనా?