Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 కొత్త రకంగా ముందుకు సాగిపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రెగ్యులర్ గా చూసే ఆడియన్స్ కి ఏంటి ఈ సోది అని చాలా మంది ఈ సీజన్ ని చూడడం ఆపేసారు. టాస్కులు కూడా సీజన్ 7 రేంజ్ ఏ మాత్రం కూడా లేదు. చిన్న పిల్లలు ఆడుకునే ఆటలు పెట్టాడు. కంటెస్టెంట్స్ సందర్భం లేకుండా అరుచుకోవడం, ఊరికే కౌగిలించుకోవడం, ఇలా ఈ సీజన్ మొత్తం బిల్డప్స్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టుగానే సాగుతుంది. ఇకపోతే ఈ వారం శేఖర్ బాషా ని ఎలిమినేట్ చేసి చూసే ప్రేక్షకులందరికీ ఇంత అన్యాయమా అని అనిపించేలా చేసాడు బిగ్ బాస్. కానీ యష్మీ ఆట తీరుని బయట పెట్టి , ఆమె చేసే మోసాలను ప్రజానాలకు మరోసారి అర్థం అయ్యేలా చేయడం లో మాత్రం బిగ్ బాస్ ది బెస్ట్ అనిపించుకున్నాడు.
అంతే కాకుండా యష్మీ , నైనికా క్లాన్స్ ని తొలగించి, సభ్యులు మొత్తాన్ని పీకేయడం కూడా బిగ్ బాస్ టీం తీసుకున్న నిర్ణయాలలో బెస్ట్ అని చెప్పొచ్చు. ఇకపోతే నిఖిల్ చీఫ్ గానే కొనసాగుతుండగా, మరో చీఫ్ గా అభయ్ ఎంపిక అయ్యాడు. నిఖిల్ క్లాన్ లో సీత, విష్ణు, పృథ్వీ, సోనియా మరియు నైనికా ఉండగా, అభయ్ క్లాన్ లో యష్మీ , నాగ మణికంఠ, ఆదిత్య ఓం, ప్రేరణా మరియు నబీల్ ఉన్నారు. అయితే ఇంతకు ముందు నిఖిల్ క్లాన్ లో ఉన్నటువంటి నాగ మణికంఠ ఇప్పుడు అభయ్ క్లాన్ లోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు, ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు, ఇలాంటి సమయంలో వీళ్లిద్దరు విడిపోవడం తో గేమ్ కాస్త ఆసక్తికరంగా మారింది. అలాగే కిరాక్ సీత, ఆదిత్య ఓం మధ్య కూడా మంచి రిలేషన్ ఏర్పడింది. వీళ్లిద్దరు కూడా ఇప్పుడు వేర్వేరు క్లాన్స్ లో ఉండడం వల్ల భవిష్యత్తులో గొడవలు రావొచ్చు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎప్పుడూ గొడవ పడే విష్ణు, సోనియా ఒకే టీం లో ఉండడమే.
ఇప్పుడు సోనియా కి విష్ణు ప్రియా ని తిట్టడం వల్ల నెగటివ్ అవుతున్నావు అని నాగార్జున ఆమెకి హింట్ ఇవ్వడం తో రాబోయే రోజుల్లో విష్ణు తో సోనియా స్నేహం చేయొచ్చు. అయితే నిఖిల్ టీం లో కిరాక్ సీత తప్ప టాస్కులు బాగా ఆడే కంటెస్టెంట్స్ లేరు. విష్ణు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఆమెకి కూడా క్లారిటీ లేదు, పృథ్వీ గేమ్ రూల్స్ అనుసరిస్తూ ఆడడం తప్ప ఏదైనా చేస్తాడు. సోనియా ఎలా ఆడుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. నైనికా చాలా ఫోకస్ గా ఆడుతుంది కానీ ఆమె ఆట ని పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు చూడలేదు. కాబట్టి నిఖిల్ క్లాన్ పొరపాట్లు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వచ్చే వారం నాగార్జున నుండి కోటింగ్ కూడా పడొచ్చు, చూడాలి మరి.