Ravi Teja’s Ravanasura: హీరో రవితేజ వరుస హిట్స్ తో జోష్ లో ఉన్నారు. క్రాక్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన రవితేజకు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ షాక్ ఇచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. ధమాకా మూవీతో రవితేజ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ధమాకా సూపర్ హిట్ కొట్టింది. భారీ వసూళ్లు రాబట్టింది. వాల్తేరు వీరయ్య మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో ఆయనది ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి స్టామినాకు రవితేజ ఎనర్జీ తోడు కావడంతో భారీ హిట్ పడింది.

వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఆ లెక్కన రవితేజ వరుసగా రెండు హిట్స్ కొట్టినట్లు అయ్యింది. కాగా మరో నెల రోజుల్లో రావణాసుర గా థియేటర్స్ లో దిగుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రావణాసుర ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా తెలియజేశారు. ఈ క్రమంలో టీజర్ విడుదల చేస్తున్నారు. మార్చి 6వ తేదీ ఉదయం 10:08 నిమిషాలకు రావణాసుర టీజర్ విడుదల కానుంది.
ఇది ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ అని చెప్పాలి. ఈ చిత్రంలో ఏకంగా నలుగురు యంగ్ బ్యూటీస్ నటిస్తున్నారు. దక్షా నగర్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. వీరి క్యారెక్టర్స్ ఏమిటనేది ఆసక్తికర అంశం. కాగా అక్కినేని హీరో సుశాంత్ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర మీద కూడా ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. ధమాకా చిత్రానికి మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరో మరోసారి రావణాసుర చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రావణాసుర మూవీతో రవితేజ హ్యాట్రిక్ పూర్తి చేస్తారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రవితేజ ఖాతాలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఇది తెరకెక్కుతుంది. విశేషం ఏమిటంటే రేణు దేశాయ్ ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె కీలక రోల్ చేస్తున్నారు.