Homeఎంటర్టైన్మెంట్Ravi Teja: ఓటీటీలో చరిత్ర సృష్టించిన రవితేజ మూవీ... ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం!

Ravi Teja: ఓటీటీలో చరిత్ర సృష్టించిన రవితేజ మూవీ… ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం!

Ravi Teja: రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం(Tiger Nageswara Rao Movie) అరుదైన ఫీట్ సాధించింది. ఇండియాలోనే మొదటి చిత్రంగా రికార్డులకు ఎక్కింది. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది టైగర్ నాగేశ్వరరావు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్ర చేశారు. యంగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ ఆకెళ్ళ(Vamsi Krishna Akella) తెరకెక్కించాడు. నుపుర్ సనన్(Nupur Sanon), గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. రేణు దేశాయ్(Renu Desai) టైగర్ నాగేశ్వరరావు మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన టైగర్ నాగేశ్వరరావు ఆశించిన స్థాయిలో ఆడలేదు.

టైగర్ నాగేశ్వరావు మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ప్రైమ్ లో టైగర్ నాగేశ్వరరావు స్ట్రీమ్ అవుతుంది. కాగా బధిరుల కోసం టైగర్ నాగేశ్వరరావు మూవీ సైన్ లాంగ్వేజ్ వెర్షన్ తీసుకువచ్చారు. వినలేని వాళ్ళు సైన్ లాంగ్వేజ్ లో మూవీ చూసి ఎంజాయ్ చేయవచ్చు. బీజీఎమ్ మిస్ అయినా కూడా డైలాగ్స్ ఏమిటీ? కథ ఏమిటీ? అనేది వారు అర్థం చేసుకోగలరు.

ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో అందుబాటులోకి వచ్చిన ఫస్ట్ ఇండియన్ మూవీగా టైగర్ నాగేశ్వరరావు రికార్డులకు ఎక్కింది. టైగర్ నాగేశ్వరరావుతో పాటు పలు చిత్రాలు సైన్ లాంగ్వేజ్ లో అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తేనుందని సమాచారం. ఇకపై దివ్యాంగులు కూడా చిత్రాలను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

సైన్ లాంగ్వేజ్ లో టైగర్ నాగేశ్వరరావు అందుబాటులోకి వచ్చినట్లు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శాంపిల్ గా చిన్న టీజర్ సైతం పంచుకున్నారు. మొత్తంగా టైగర్ నాగేశ్వరరావు మూవీతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇతర దేశాల్లో సైన్ లాంగ్వేజ్ లో చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఒరవడి మొదలవుతుంది.

Kanguva Movie: సూర్య కంగువ మూవీ ముందు పెద్ద చాలెంజే ఉందిగా…

Exit mobile version