https://oktelugu.com/

వచ్చేస్తున్న ‘ఖిలాడి’ టీజర్.. డేట్ ఫిక్స్!

వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలాప‌డిన ర‌వితేజ కెరీర్ కు రెట్టింపు ఎన‌ర్జీ ఇచ్చింది ‘క్రాక్‌’! ఈ సినిమా స‌క్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చేసిన మాస్ మ‌హారాజ్.. వ‌రుస‌గా సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఇందులో మొద‌టగా రాబోతున్న‌ది ‘ఖిలాడి’. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వీరిద్ద‌రూ గ‌తంలో ‘వీర’ చిత్రం తో అల‌రించారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఖిలాడి’ అంటూ వచ్చేస్తున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో […]

Written By:
  • Rocky
  • , Updated On : April 9, 2021 / 02:45 PM IST
    Follow us on


    వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలాప‌డిన ర‌వితేజ కెరీర్ కు రెట్టింపు ఎన‌ర్జీ ఇచ్చింది ‘క్రాక్‌’! ఈ సినిమా స‌క్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చేసిన మాస్ మ‌హారాజ్.. వ‌రుస‌గా సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఇందులో మొద‌టగా రాబోతున్న‌ది ‘ఖిలాడి’.

    రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వీరిద్ద‌రూ గ‌తంలో ‘వీర’ చిత్రం తో అల‌రించారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఖిలాడి’ అంటూ వచ్చేస్తున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ర‌వితేజ డ్యుయ‌ల్ రోల్ లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

    అయితే.. ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఈ నెల 12న టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి సిద్ధ‌మైంది యూనిట్‌. ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఈ విష‌యాన్ని అనౌన్స్ చేస్తూ ర‌వితేజ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు.

    ఈ సినిమాలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్ర‌సాద్ సంగీతం సమ‌కూరుస్తున్న ఈ చిత్రాన్ని కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా సినిమాను కంప్లీట్ చేసి మే 28న రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.