మళ్ళీ ఓకే చెప్పింది, పెళ్లి చేసుకోదా ఏంటి ?

‘కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు, కానీ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్కకు మాత్రం అసలు కళ్యాణమే వచ్చేలా లేదు. నిజం మాట్లాడుకుంటే ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే పెళ్లి ఈడుకొచ్చింది అనుష్క. అవ్వాల్సిన టైంలో పెళ్లి అయి ఉంటే.. అనుష్క కూతురు కూడా ఈ పాటికి సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ లతో ఫుల్ బిజీగా ఉండేది. కానీ బ్యాడ్ టైమ్, అనుష్కకి ఇప్పటికీ కూడా ఇంకా పెళ్లి అయ్యేలా కనబడటం లేదు. అనుష్క వివాహం […]

Written By: admin, Updated On : April 9, 2021 2:40 pm
Follow us on


‘కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు, కానీ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్కకు మాత్రం అసలు కళ్యాణమే వచ్చేలా లేదు. నిజం మాట్లాడుకుంటే ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే పెళ్లి ఈడుకొచ్చింది అనుష్క. అవ్వాల్సిన టైంలో పెళ్లి అయి ఉంటే.. అనుష్క కూతురు కూడా ఈ పాటికి సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ లతో ఫుల్ బిజీగా ఉండేది. కానీ బ్యాడ్ టైమ్, అనుష్కకి ఇప్పటికీ కూడా ఇంకా పెళ్లి అయ్యేలా కనబడటం లేదు.

అనుష్క వివాహం విషయంలో ఇప్పటికే పలుమార్లు రూమర్లు వచ్చినా అనుష్క మాత్రం వాటి పై పెద్దగా స్పందన కూడా తెలియజేయడానికి ఆసక్తి చూపలేదు. కాగా బాహుబలి తరువాత కొంత గ్యాప్ తీసుకుని బాగమతి సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమా తరువాత మళ్ళీ గ్యాప్ తీసుకుని నిశ్శబ్దం సినిమా చేసింది. అలాగే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరో వస్తోన్న సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన నటించబోతుందని వార్తలు వచ్చాయి.

కాగా ఈ సినిమా తరువాత అనుష్క మరో లేడి ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది లేటెస్ట్ అప్ డేట్. పైగా ఆ సినిమాకు తమిళ క్రేజీ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించబోతునున్నాడట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, ఈ న్యూస్ గురించి విన్నవాళ్ళు మాత్రం మళ్ళీ ఓకే చెప్పిందా, ఇక పెళ్లి చేసుకోదా ఏంటి ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక గౌతమ్ మీనన్ సినిమా బాలీవుడ్ రచయిత గోవింద్ నిహ్లానీ రాసిన ఓ నవల ఆధారంగా ఉంటుందని.. సినిమాలో అనుష్క పాత్ర చాలా కొత్తగా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. ఎంతైనా బాహుబలి సినిమాతో దేవసేనగా పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది అనుష్క్.