https://oktelugu.com/

ఓటీటీలోకి ‘నిశ్శబ్ధం’గా.. రిలీజ్ డేట్ అదే?

కరోనా లాక్ డౌన్ తో మార్చిలో విడుదల కావాల్సిన అనుష్క ‘నిశ్శబ్ధం’ సినిమా వాయిదాల మీద వాయిదా పడింది. బహుభాషల్లో విడుదల చేయడానికి రెడీ కాగా కరోనాతో థియేటర్లు మూతపడి సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. చాలా మంది వెయిట్ చేసి ఇక థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. Also Read: 3వేల పాటలు పాడి 85 లక్షలు పేదలకు పంచిన చిన్మయి ప్రస్తుతం షూటింగ్ అయిపోయి విడుదలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2020 / 04:26 PM IST

    anushka nishabdam

    Follow us on

    కరోనా లాక్ డౌన్ తో మార్చిలో విడుదల కావాల్సిన అనుష్క ‘నిశ్శబ్ధం’ సినిమా వాయిదాల మీద వాయిదా పడింది. బహుభాషల్లో విడుదల చేయడానికి రెడీ కాగా కరోనాతో థియేటర్లు మూతపడి సినిమా రిలీజ్ కు నోచుకోలేదు.

    చాలా మంది వెయిట్ చేసి ఇక థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు.

    Also Read: 3వేల పాటలు పాడి 85 లక్షలు పేదలకు పంచిన చిన్మయి

    ప్రస్తుతం షూటింగ్ అయిపోయి విడుదలకు నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో దక్షిణాది సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘నిశ్శబ్ధం’ కూడా ఒకటి.

    హిమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తీసిన ఈ చిత్రాన్ని ఇప్పుటు ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను తాజాగా అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది.

    Also Read: బోల్డ్ డైరెక్టర్ కి సీనియర్ హీరోయిన్స్ దూరం !

    అక్టోబర్ 2న అనుష్క ‘నిశ్శబ్ధం’ మూవీని అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషించారు. షాలిని పాండే, అంజలి ఇతర ప్రధాన పాత్రధారులు. 5 భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్రానికి  ఇప్పటికైనా బజ్ వస్తుందా లేదా చూడాలి.