Homeఎంటర్టైన్మెంట్Ravi Teja: రవితేజ నిజంగానే ‘ఫుల్‌ కిక్‌’’ ఇచ్చాడు

Ravi Teja: రవితేజ నిజంగానే ‘ఫుల్‌ కిక్‌’’ ఇచ్చాడు

Ravi Teja: సినీప్రియులకు ఫుల్‌ కిక్‌ అందిస్తానంటూ గణతంత్రదినోత్సవం రోజున ‘‘ఫుల్‌ కిక్‌’’ అనే సాంగ్ తో దూసుకొచ్చారు కథానాయకుడు రవితేజ. మాస్ మహారాజా రవితేజ బర్త్‌డే సందర్భంగా ‘ఖిలాడీ’ నుంచి వచ్చిన ఈ ‘ఫుల్ కిక్కు’ సాంగ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సాంగ్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు కూడా ఈ సాంగ్ ను ఫుల్ గా షేర్ అండ్ లైక్ చేస్తున్నారు.

Ravi Teja:
Ravi Teja:

కాగా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ నిజంగానే ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కు ఎక్కించింది. కాగా, ఈ పాటతో కలిపి ఇప్పటివరకు ఈ సినిమా నుంచి 4 సాంగ్స్ రిలీజ్ చేసినట్టు అయింది. రమేష్‌ వర్మ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ ‘ఖిలాడి’ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు.

Also Read: ధనుష్ కి హెల్త్ బాగాలేదు.. కానీ ప్రేమ పాటతో ఐశ్వర్య బిజీ !

Ravi Teja
Ravi Teja

ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రంలోని ‘‘ఫుల్‌ కిక్‌’’ అంటూ సాగే నాలుగో పాట రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాలో నాజర్, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలలో పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు అని టాక్ ఉంది.

మొత్తానికి ఈ సినిమా పట్ల రవితేజ అభిమానులు ఇంట్రెస్ట్ చూపించేలా చేసుకోవడంలో టీమ్ బాగా సక్సెస్ అయింది. ముఖ్యంగా చిత్రబృందం ప్రమోషన్స్ చాలా విభిన్నం ఉండటం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది.

Also Read: ప్రభాస్ యూరప్ ట్రిప్ ముగిసింది.. ఇక మీనాక్షి చౌదరితో రొమాన్స్ కి రెడీ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular