Pushpa Movie: దేశం మొత్తం పుష్ప మేనియాతో ఊగిపోతోంది. హిందీలో ఈ మూవీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా ఎవరెస్టు కి చేరింది. పుష్ప మూవీలో అల్లు అర్జున్ డైలాగ్స్ మేనరిజాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ సైతం ఇమిటేట్ చేస్తూ వీడియో చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పుష్ప మూవీ ఎంత ప్రభంజనం సృష్టించిందో. అల్లు అర్జున్ రేంజ్ మార్చేసిన పుష్ప నిజానికి ఆయన చేయాల్సింది కాదు. అలాగే హీరోయిన్ రష్మిక, విలన్ ఫహద్ ఫాజిల్ సుకుమార్ ఆప్షన్ కాదు.

మరి ఇంత పెద్ద హిట్ సినిమా కోల్పోయిన స్టార్స్ ఎవరో చూద్దాం. రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అందుకున్న నేపథ్యంలో సుకుమార్ పుష్ప కథ సిద్ధం చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ మొదట ఆయన మహేష్ బాబుకు వినిపించారు. కథ నచ్చినప్పటికీ డార్క్ షేడ్స్ ఉన్న డీగ్లామర్ రోల్ తనకు సెట్ కాదని మహేష్ సున్నితంగా తిరస్కరించాడు. మహేష్ రిజెక్ట్ చేయడంతో ఈ సబ్జెక్ట్ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది.
Also Read: ప్రభాస్ యూరప్ ట్రిప్ ముగిసింది.. ఇక మీనాక్షి చౌదరితో రొమాన్స్ కి రెడీ !

అలాగే శ్రీవల్లి పాత్ర కోసం సుకుమార్ హీరోయిన్ సమంతను అనుకున్నారు. కేవలం సమంతను దృష్టిలో ఉంచుకొని శ్రీవల్లి పాత్ర డెవలప్ చేశా రు. తీరా సమంతను సంప్రదిస్తే కొన్ని కారణాల చేత ఆమె చేయను అన్నారు. సమంత చేయనని చెప్పడం సుకుమార్ ని నిరాశపరిచింది. దానితో వరుస విజయాలతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న రష్మిక మందానను సంప్రదించగా ఆమె ఓకే చేశారు. దీంతో ఆమెకు పుష్ప రూపంలో మరో భారీ హిట్ దక్కింది.

కాగా పుష్ప మూవీలో ప్రధాన విలన్ భన్వర్ లాల్ షెకావత్ పాత్ర కోసం సుకుమార్ చాలా మందిని సంప్రదించారు. ఆయన ఫస్ట్ ఆప్షన్ గా విజయ్ సేతుపతి ఉన్నారు. పుష్ప లో ఆయన పాత్ర నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో విజయ్ సేతుపతి చేయను అన్నారు. తర్వాత హీరో నారా రోహిత్ వద్దకు ఈ ఆఫర్ వెళ్ళింది. అలాగే బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తాను కూడా సంప్రదించారు. వారందరూ వివిధ కారణాలతో షెకావత్ రోల్ చేయననడంతో ఫహాద్ ఫాజిల్ వద్దకు వెళ్ళింది.

ఇక సమంత చేసిన ఐటెం సాంగ్.. ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ యూత్ ని ఊపేస్తుంది. సూపర్ హిట్ కొట్టిన ఈ ఐటెం సాంగ్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని చేయాల్సింది. ఆమె అంగీకరించకపోవడంతో సమంత చేశారు.

Also Read: ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే.. ఆ వేషధారణ.. ఇదే ప్రధాని మోడీ నైజం..!
[…] Samantha wants divorce : చైతు – సమంత విడాకులకు ముఖ్య కారణం ఇదే అంటూ అనేక పుకార్లు పుట్టించారు. అయితే, తాజాగా ఈ అంశం పై నాగార్జున స్పందించాడు. పైగా సమంత, నాగచైతన్య విడాకుల పై నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాగార్జున మాట్లాడుతూ.. ‘సమంతే తొలుత విడాకులు కావాలని కోరిందని, ఆమె నిర్ణయాన్ని గౌరవించిన చైతూ అందుకు అడ్డుచెప్పలేకపోయాడని నాగ్ చెప్పుకొచ్చాడు. […]