Shyam Singaray: రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. థియేటర్లలో మంచి హిట్ సాధించిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లోనూ రిలీజై బాగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు ఇప్పటి వరకూ 35,90,000 వీక్షణలు వచ్చాయి.

దీంతో నెట్‌ఫ్లిక్స్ లో ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన 3వ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. మొత్తానికి యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తన డైరెక్షన్ తో ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయిపల్లవి నటన కూడా అద్భుతంగా ఉంది. ఇక కృతిశెట్టి గ్లామర్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది.
Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ ఖాతాలో మరో వరల్డ్ రికార్డు !
మొత్తమ్మీద ‘శ్యామ్ సింగరాయ్’ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా టీమ్ ఈ విషయాన్ని ఫుల్ ప్రమోట్ చేయడానికి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు. హీరో నాని కూడా ఈ విజయాన్ని తన స్టార్ డమ్ ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

మరోపక్క విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. ఏది ఏమైనా మొదటి రోజు నుంచీ ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో స్టడీగా థియేటర్ రెవెన్యూ ఈ సినిమాకు వచ్చింది.
పైగా ఈ ‘శ్యామ్ సింగ రాయ్’కి హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఈ సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నాడు కాబట్టి.. ఈ సినిమా నిర్మాతకు బాగా కలిసి వచ్చింది. మంచి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ హిట్ కోసం నాని ఎంతో కసితో ఈ సినిమా చేశాడు. చివరకు ఆ ఫలితం వచ్చింది.
Also Read: పుష్ప మూవీ ఈ స్టార్స్ చేయాల్సింది.. ఎందుకు వదులుకున్నారు?
[…] Disha Patani: లోఫర్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని బోల్డ్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆడ అరేబియన్ గుర్రంలా ఉండే దిశా పటానిని చూస్తే, పుట్టించిన బ్రహ్మకైనా మతి చెదరాల్సిందే. ఫిట్ నెస్ ఫ్రీక్ కావడంతో గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేసి సుందరమైన శరీర ఆకృతి సాధించింది. మరి కష్టపడి మెరుగులు దిద్దిన అందాలు చూపించకపోతే వారికి విలువేమి ఉంటుంది. […]
[…] Manchu Vishnu: మంచు విష్ణుకి అడపా దడపా కొన్ని హిట్లు వచ్చినా స్టార్ కాలేకపోయాడు. ఇక ఐదారేళ్ల నుంచి మంచు విష్ణు నుంచి ఓ మోస్తరు స్థాయి సినిమా కూడా రాకపోవడం విచిత్రమే. మొత్తానికి తనకు హీరోగా పెద్దగా కలిసి రాలేదు కాబట్టి.. నిర్మాతగా ఫుల్ బిజీ కావాలని మంచు విష్ణు ఫిక్స్ అయ్యాడు. విష్ణు తాజాగా మరో వ్యాపారంలోకి దిగాడు. అవా (అవ) ఎంటర్టైన్మెంట్ పేరుతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని విష్ణు స్టార్ట్ చేశాడు. […]