Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకు మాత్రమే వాల్యూ ఇస్తారు. వాళ్లతో మాత్రమే సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తారు… రవితేజ లాంటి నటుడు సైతం సోలోగా ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సత్తా చాటుకొని స్టార్ హీరోగా అవతరించాడు. ఆయన కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కొంతమంది అతన్ని చాలా తక్కువ చేసి చూసారని ఒక ప్రొడ్యూసర్ అయితే అతనితో చాలా అసభ్యంగా మాట్లాడాడు అంటూ ప్రముఖ రచయిత అయిన కోన వెంకట్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ప్రస్తుతం ఆయన ‘బ్యాండ్ మేళం’ అనే సినిమానైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్ శకం.. బీజేపీ ఖాలాలోకి బిహార్!
ఈ సినిమా శ్రీరామనవమి కానుకగా మార్చి 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇండస్ట్రీ లో అవమానాలు జరుగుతాయని వాటి నుంచి కసి పెరిగి మనం ముందుకు దూసుకుళ్ళే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన చెప్పాడు.
ఇక అందులో భాగంగానే రవితేజ లాంటి నటుడు సైతం కెరీర్ స్టార్టింగ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ లో తింటున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ వచ్చి విసుగ్గా ఎవడు పడితే వాడు వచ్చి తినేస్తున్నారు అంటూ కొన్ని ఘాటు మాటలైతే మాట్లాడాడు. దాంతో రవితేజ ఎలాగైనా సరే తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే కసి అయితే తనలో పెరిగిందని అందువల్లే అయన స్టార్ హీరో పొజిషన్ కి వెళ్ళాడని చెప్పాడు. అలాగే ఆయన స్టార్ హీరోగా మారిన తర్వాత కూడా ఆ ప్రొడ్యూసర్ రవితేజ డేట్స్ కోసం చాలా సార్లు ఆయన క్యారవాన్ చుట్టూ తిరిగాడని చెప్పాడు.
దాంతో రవితేజ అవేమి మనసులో పెట్టుకోకుండా ఆ ప్రొడ్యూసర్ తో సినిమా చేశాడు. ఇక్కడ రివెంజ్ సాధించడం కంటే కూడా మనల్ని తక్కువ చేసిన వాళ్ళు మన కోసం వచ్చి మనల్ని అడిగినప్పుడు సినిమా చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి ఆ విషయంలో రవితేజ చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడంటూ ఆయన చెప్పడం విశేషం…