Ravi Teja
Ravi Teja : సినిమా ఇండస్ట్రీలో చాలామందికి హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు, కానీ దర్శకుల గురించి ఎవరు పట్టించుకోరు. ఒక సినిమా సక్సెస్ లో దర్శకులదే కీలకపాత్ర…కానీ హీరోలు మాత్రమే చాలా గొప్పగా ఎలివేట్ అవుతూ ఉంటారు…కానీ సామాన్య జనాలు మాత్రం స్క్రీన్ మీద కనిపించే హీరోలకి ఫ్యాన్స్ గా మారుతూ వాళ్ళ కోసమే చొక్కాలు చించుకుంటూ వీరాభిమానులుగా మారిపోతూ ఉంటారు…ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు గొప్ప హీరోలను తయారు చేశారు, కానీ ఏ హీరో కూడా గొప్ప దర్శకుడుని తయారు చేయలేకపోయాడు…
ఒకప్పుడు లవ్ స్టోరీ లతో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు తేజ (Teja) వరుసగా చిత్రం(Chitram),నువ్వు నేను(Nuvvu Nen) , జయం(Jayam) లాంటి సినిమాతో మంచి విజయాలను సాధించి అప్పుడున్న యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుంచి తేజ డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు సక్సెస్ అయితే దక్కడం లేదు. ఈ సినిమా చేసిన కూడా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడమే తప్ప సక్సెస్ బాట పట్టడం లేదు. కారణం ఏదైనా కూడా ఆయన ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలను చేయడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక 2017 వ సంవత్సరంలో రానా హీరోగా వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
Also Read : రూటు మార్చిన మాస్ మహరాజ్, క్లాస్ చిత్రాల దర్శకుడికి ఛాన్స్… రవితేజకు హిట్ పడేనా?
ఈ సినిమాతో మరోసారి ఆయన కంబ్యాక్ ఇచ్చాడని అందరూ అనుకున్నప్పటికి ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు వరుస ప్లాప్ అయ్యాయి.ఇక తేజ, రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది అనుకోని కారణాలవల్ల ఈ సినిమా తెరమీదకి రాలేదు. ఆ సినిమా ఏంటి అంటే ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే చెప్పాలి.
అయితే రానాతో చేసిన ఈ సినిమాని మొదట రవితేజతో చేయాలనుకున్నాడట. రవితేజ కూడా ఈ కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి అప్పుడు రవితేజ ఉన్న బిజీ వల్ల ఈ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోయాడు. దాంతో తేజ రవితేజ కోసం వెయిట్ చేసే ఓపిక లేక ఈ సినిమాను రానాతో చేశాడు. సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అటు రానాకి, ఇటు తేజకి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చిందనే చెప్పాలి… మరి మరోసారి తేజ ఇలాంటి ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని చేస్తే బాగుంటుంది అంటూ చాలామంది జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ ఆయన మాత్రం ఇప్పుడు అలాంటి సినిమాలను చేసే ఉద్దేశ్యంతనకు లేదంటూ క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశాడు… మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి దర్శకుడి తో సినిమా చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. ఆయన అందరితో సినిమా చేయలేడు ఆయనకు నచ్చిన వాళ్ళతో మాత్రమే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు…
Also Read : రాజమౌళి చేసిన విక్రమార్కుడు సినిమాలో రవితేజ డూప్ గా నటించింది ఆ నటుడా..? అసలు గుర్తుపట్టలేదుగా…