AP Unemployees: తెలంగాణ ఉద్యమం కారణంగా రాష్ట్రంలోని యువత, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన కేసీఆర్(KCR) ప్రభుత్వం ఉద్యోగాలకు అర్హత వయసును పెంచింది. ఇప్పటికీ ఆ పెంపు కొనసాగుతోంది. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం(AP Government) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల అర్హత వయసు పరిమితిని పెంచింది. 2019 నుంచి 2024 వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక చాలా మంది నష్టపోయారు. అర్హత కోల్పోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల అర్హత వయసు పెంచాలని నిర్ణయించింది.
Also Read : ఏపీలో రోడ్డెక్కిన నిరుద్యోగులు.. ఇక కూటమి సర్కార్ కు కష్టమే!
పెంపు ఇలా…
నాన్–యూనిఫాం ఉద్యోగాలు: గరిష్ఠ వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు పెంచారు.
యూనిఫాం సర్వీసెస్: ఇప్పటికే ఉన్న వయోపరిమితికి అదనంగా 2 సంవత్సరాలు పొడిగించారు.
ఈ సవరించిన వయోపరిమితి 2025 సెప్టెంబర్ 30 వరకు జరిగే రిక్రూట్‌మెంట్‌లకు వర్తిస్తుంది. ఈ నిర్ణయం నిరుద్యోగ యువతకు మరింత అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించినదిగా ప్రభుత్వం పేర్కొంది. గతంలో కూడా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన సందర్భం ఉంది, ఇది 2022 జనవరిలో అమలులోకి వచ్చింది.
Also Read : బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ఉద్యోగులకు హెచ్చరిక…!