https://oktelugu.com/

Tollywood Drugs Case: ముగిసిన రవితేజ విచారణ.. ఏం చెప్పాడంటే?

Tollywood Drugs Case:టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో ఈరోజు టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఈడీ విచారణ ముందు హాజరయ్యాడు. టాలీవుడ్ ను కుదిపేస్తున్న ఈ డ్రగ్స్ కేసులో వరుసగా సినీ ప్రముఖులు హాజరై ఈడీ ఎదుట హాజరు పరుస్తున్నారు. తాజాగా గురువారం మాస్ మహరాజ రవితేజతోపాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా అధికారులు విచారించారు. సినీ ప్రపంచంతో డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు విచారణ మొదలుపెట్టారు.. ఇందులో భాగంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2021 / 06:09 PM IST
    Follow us on

    Tollywood Drugs Case:టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో ఈరోజు టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఈడీ విచారణ ముందు హాజరయ్యాడు. టాలీవుడ్ ను కుదిపేస్తున్న ఈ డ్రగ్స్ కేసులో వరుసగా సినీ ప్రముఖులు హాజరై ఈడీ ఎదుట హాజరు పరుస్తున్నారు. తాజాగా గురువారం మాస్ మహరాజ రవితేజతోపాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా అధికారులు విచారించారు.

    సినీ ప్రపంచంతో డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు విచారణ మొదలుపెట్టారు.. ఇందులో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి, రకుత్ ప్రీత్ సింగ్, నటుడు నందులను విచారించారు. పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి ఒక్కోరోజు ఒక్కొరొక్కరుగా విచారణ చేస్తున్నారు.

    బుధవారం హీరో రానాను అధికారులు దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. డ్రగ్స్ వినియోగం, ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై వీరిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు వీరి బ్యాంకు లావాదేవీలు, యూపీఐ లావాదేవీల వివరాలను వీరి నుంచి అధికారులు సేకరించారు.

    డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్ గా మారి ఇచ్చిన సమాచారంతో ఈ విచారణ కొనసాగుతోంది. సెలబ్రెటీలతోపాటు మరో వైపు కెల్విన్ ను అతడితో సంబంధం ఉన్న వారిని కూడా అధికారులు విచారిస్తున్నారు.

    గురువారం హీరో రవితేజ విచారణకు హాజరయ్యారు. ఆయనతోపాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్, కెల్విన్ సన్నిహితుడు జిషాన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల సమయంలో రవితేజ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. రవితేజ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు వచ్చారని సమాచారం. రవితేజ నుంచి బ్యాంకు వివరాలు అధికారులు సేకరించినట్టు తెలిసింది. డ్రైవర్ శ్రీనివాస్ ద్వారా జరిపిన లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది.