
Kerala Massage Parlours: బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ అడ్డదారుల్లో సంపాదన కోసమే అందరు అర్రులు చాస్తున్నారు. అడ్డంగా దొరికిపోతున్నారు. అప్పనంగా వచ్చే డబ్బు కోసం వెంపర్లాడుతన్నారు. ఫలితంగా కటాకటాలు లెక్కిస్తున్నారు. న్యాయంగా సంపాదిస్తే అందులో ఉండే మజానే వేరు. కానీ అక్రమంగా సంపాదిస్తే నిరంతరం భయం గుప్పిట్లో గడపాల్సిందే. పరువు మొత్తం గంగలో కలుస్తుంది. అయినా ఎవరు కూడా లెక్కచేయడం లేదు. అడ్డదారుల్లో వెళ్లేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బుల కోసం ఎంతటి జుగస్సాకరమైన విషయాలనైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కేరళలోని కొట్టాయంలో నివాసం ఉంటున్న రాజేష్ (36), ఆంధ్రప్రదేశ్ కు చెందిన అను అలియాస్ జ్యోతిరెడ్డి (28) ప్రేమించుకున్నారు. తరువాత పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నారు. బాగా పాపులర్ అయిన వ్యాపారం అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంల కేరళ ఆయుర్వేద మసాజ్ సెంటర్ కు మంచి ఆదరణ ఉందని తెలుసుకుని తమిళనాడులోని తిరుప్పూర్ లో కేరళ మసాజ్ సెంటర్ ప్రారంభించారు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోయింది.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఏర్పడింది. ఇందులో చిలుకలూరిపేట నుంచి ఆంటీలు, అమ్మాయిలను తీసుకొచ్చి హైటెక్ వ్యభించారం చేయించడం మొదలు పెట్టారు. గంటకు, పూటకు, రాత్రికి వేర్వేరు ధరలు పెట్టి మరీ అందరిని ఆకర్షించడం మొదలు పెట్టారు. దీంతో వారి ఆదాయం అమాంతం పెరిగిపోయింది. హైటెక్ క్లాస్ జీవితం గడుపుతున్నారు. వారి ఫొటోలను వాట్సాప్ లలో షేర్ చేస్తూ విటును ఆకర్షించారు. దీంతో వారికి లగ్జరీ లైఫ్ దక్కింది.
ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆశ్చర్యపోయారు. వారి చేసే పనులు చూసి వారిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాపారంలో ఇంత లాభం ఉందా అని నోరెళ్లబెట్టారు. వ్యాపారం చేస్తున్న రాజేష్ జ్యోతిరెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.