Ravi Teja : ‘ధమాకా’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఇవ్వడం, వాళ్ళు సరిగా తీయలేక ఫ్లాప్స్ ఇవ్వడం వంటివి జరిగాయి. రవితేజ యతీస్తున్న సినిమాలపై ఆయన అభిమానులు కూడా తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ లేఖలు రాయడం వంటివి మనం చూసాము. అయితే ఇలాంటి పీరియడ్ లో రవితేజ ఒక క్రేజీ కాంబినేషన్ ని వదిలేయడం, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ చేతుల్లోకి వెళ్లడం వంటివి జరిగాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే రవితేజ కారణంగా డైరెక్టర్ గా మారిన దర్శకులలో ఒకరు గోపీచంద్ మలినేని(Gopichand Malineni). ‘డాన్ శ్రీను’ సినిమాతో ఆయన ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
Also Read : ‘ఐరన్ మ్యాన్’ తరహా సూపర్ హీరో కథలో రవితేజ..డైరెక్టర్ ఎవరంటే!
ఆ తర్వాత ఆయన వెంకటేష్ తో బాడీ గార్డ్ అనే చిత్రం చేసాడు. ఇది కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. మళ్ళీ రవితేజ తో ఆయన ‘బలుపు’ చిత్రం చేసి సూపర్ హిట్ ని అందుకోగా, ఆ తర్వాత ‘పండగ చేసుకో’, ‘విన్నర్’ లాంటి సినిమాలు చేసాడు. ఇవి రెండు ఆశించిన స్థాయిలో ఆడలేదు. మళ్ళీ ఆయనకు ‘క్రాక్’ సినిమా రూపం లో హిట్ ఇచ్చింది రవితేజ నే. ఇలా గోపీచంద్ మలినేని కెరీర్ లో నాలుగు హిట్స్ ఉంటే అందులో మూడు రవితేజ సినిమాలే ఉన్నాయి. నాల్గవ సినిమాగా గత ఏడాది ప్రారంభం లో గ్రాండ్ గా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో ప్రకటించారు. ఫోటో షూట్ కూడా జరిగింది. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతుంది అని అనుకుంటున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
బడ్జెట్ అంచనాలను మించడం తో రవితేజ తో ఈ సినిమా చేయలేమని నిర్మాతలు చేతులెత్తేశారు. కానీ ఇదే స్టోరీ ని బాలీవుడ్ యాక్షన్ హీరోలలో ఒకరైన సన్నీ డియోల్(Sunny Deol) కి చెప్పి ఒప్పించారు. అలా వీళ్ళ కాంబినేషన్ లో మొదలైన సినిమానే ‘జాట్'(Jatt Movie). రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ వంటివి విడుదల అయ్యాయి. ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. చూసిన ప్రతీ ఒక్కరు అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేసారు. క్వాలిటీ పరంగా కూడా సినిమా రిచ్ గా అనిపించింది. అలాంటి సినిమాని రవితేజ అనవసరం మిస్ చేసుకున్నాడు. రెమ్యూనరేషన్ ని తగ్గించుకొని అయినా ఈ సినిమా చేసుండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘మాస్ జాతర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో ఒక సినిమా చేయనున్నాడు.
Also Read : స్టార్ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన రవితేజ కొడుకు.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?!