Razor Title Glimpse: తన ప్రతీ సినిమాతో ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించాలని పని చేసే డైరెక్టర్స్ లో ఒకరు రవిబాబు(Ravibabu).. సీనియర్ నటుడు చలపతి రావు కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా కామెడీ విలన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు, ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాడు. అలా ఒక పక్క నటిస్తూనే మరో పక్క తన అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తూ రవి బాబు సినిమా అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ అనే ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈయన కామెడీ జానర్, క్రైమ్ థ్రిల్లర్, హారర్ జానర్, లవ్ స్టోరీ జానర్, ఇలా దాదాపుగా అన్ని యాంగిల్స్ ని టచ్ చేస్తూ సినిమాలు చేసాడు . ఈమధ్య కాలంలో డైరెక్టర్ గా బ్రేక్ ఇచ్చిన రవిబాబు ఇప్పుడు ‘రేజర్'(Razor Movie) అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.
సురేష్ బాబు నిర్మాతగా వ్యహరించిన ఈ చిత్రం గ్లింప్స్ వీడియో ని కాసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ వీడియో ని చూస్తే ఎలాంటి వాడికైనా వణుకు పుట్టక తప్పదు. ఆ రేంజ్ లో ఉంది. టైటిల్ చూస్తేనే విచిత్రం గా ఉంది, ఇక ఈ గ్లింప్స్ లోని యాక్షన్ షాట్స్ అయితే ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని రేంజ్ లో ఉంది. చూస్తుంటే రవిబాబు ఇందులో పోలీస్ అధికారి లాగా అనిపిస్తున్నాడు. ఆయన క్రిమినల్స్ ని కొట్టడం కాకుండా, ఇష్టమొచ్చినట్టు నరికినట్టు తెలుస్తోంది. గ్లింప్స్ ఆరంభం లో చేతులు నరకడం, ఆ తర్వాత ఇంకో మనిషిని అడ్డంగా నరకడం, ఇంకొక సిరమినల్ తల ని నరకడం, ఇవన్నీ చూసేందుకు చాలా కొత్తగా డిజైన్ చేసాడు . వీటిని చూసిన ఆడియన్స్ ఇది కదా రవిబాబు మార్క్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఇంకా ఈ చిత్రం లో నటీనటులు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రవిబాబు మాత్రం ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు అనేది మాత్రం ఖరారు అయ్యింది. గతం లో రవిబాబు అనసూయ, అమరావతి వంటి క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు తీసాడు. ఈ రెండు చిత్రాలు కూడా కమర్షియల్ గా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అప్పటి వరకు ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు వచ్చాయి కానీ, ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు రాలేదు అంటూ అప్పట్లో రవిబాబు ని అందరూ పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఇప్పుడు కూడా అదే తరహా సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అనేది అర్థం అవుతోంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
