Himanta Biswa Sarma: బంగ్లాదేశ్.. మహ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భారత్‌తో సంబంధాలు దెబ్బతిటున్నాయి. ఏడాదిన్నర క్రితం వరకు షేక్ హసీనా ప్రభుత్వం భారత్‌తో ససత్సంబంధాలు కోరుకుంది. యూనస్ ప్రభుత్వం మాత్రం.. చైనా, పాకిస్తాన్‌తో చేతులు కలిపి.. భారత్‌ను కవ్విస్తోంది. తాత్కాలిక పాలకుడు ముహమ్మద్ యూనూస్, భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గాలు లేని పరిస్థితిని ఉపయోగించుకుని, తమ దేశం ఆ ప్రాంతానికి రక్షకుడని ప్రకటించారు. ఇక నేషనల్ సిటిజన్ పార్టీ నేత హస్నత్ అబ్దుల్లా అయితే ఈశాన్య రాష్ట్రాలను భారతం నుంచి విడదీయాలని
బంగ్లా సమస్యలు..
జనాభా ఒత్తిడి, వనరుల కొరతలతో బంగ్లాదేశ్ నేతలు భారత్‌పై కోపాన్ని చూపిస్తున్నారు. చికెన్ నెక్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఆ దేశంలో గందరగోళం చెలరేగిన సమయంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ స్పష్టంగా స్పందించారు. బంగ్లాదేశ్‌తో మాటలు ఆపేసి, ఆ ప్రాంతంపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
చికెన్ నెక్ అంటే ఏమిటి?
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో ఉన్న ఈ సన్నని మార్గం, భారత ఈశాన్య రాష్ట్రాలతో ప్రధాన సంబంధాన్ని కల్పిస్తుంది. కొన్ని చోట్ల 20–22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండటంతో కోడి మెడతో పోలుస్తారు. ఈ మార్గం మూసివేస్తే ఈశాన్య ఏడు రాష్ట్రాలు దేశంతో వేరైపోతాయి. కాబట్టి, ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని హిమంత సూచన చేశారు.
వ్యూహాత్మక ప్రమాదాలు
సిలిగురి సమీపంలోనే నేపాల్, భూటాన్ ఉండటంతోపాటు, చైనాకు చెందిన చుంబీ లోయ కూడా ఉంది. దోక్లాం వంటి ప్రాంతాల్లో చైనా మార్గాలు నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఏదైనా దాడి జరిగితే, సరఫరాలు ఆగిపోయి సైనిక కార్యకలాపాలు ఆగిపోతాయి. నిపుణులు భారత్‌కు ఈ ప్రాంతంపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అయితే అనవసర దూరపు ప్రాంతాలను కలపకుండా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.