Kanakamedala Ravindra Kumar: తెలుగుదేశం ( Telugu Desam) పార్టీకి కేంద్రం ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో.. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు బిజెపి పెద్దలు. ఏపీ ప్రయోజనాలతో పాటు రాజకీయంగా కూడా రాష్ట్రానికి అత్యంత ప్రయారిటీ కల్పిస్తున్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పనులకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ ను కూడా కేటాయించారు. టిడిపి నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ ను నియమించారు. ఈయన సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్నారు.
టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడిగా
తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం కొనసాగారు కనుక మేడల రవీంద్ర కుమార్( Kanaka medala Ravindra Kumar ). 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ కోవిదుడు అని పరిగణలోకి తీసుకుని రాజ్యసభ పదవి ఇచ్చారు. ఆరేళ్లపాటు అదే పదవిలో కొనసాగారు రవీంద్ర కుమార్. కొద్ది నెలల కిందట పదవీ విరమణ చేశారు. ఇంతలోనే కేంద్రం గుర్తించి సొలిసిటర్ జనరల్ పోస్ట్ కు ఎంపిక చేయడం విశేషం. చంద్రబాబు సిఫారసు మేరకు ఆయనను నియమించినట్లు తెలుస్తోంది. మరోసారి తెలుగుదేశం పార్టీకి కేంద్రం ఎనలేని ప్రాధాన్యమిచ్చినట్లు అయ్యింది.
అత్యున్నత పదవి..
అడిషనల్ సొలిసిటర్ జనరల్ ( additional Solicitor General) అనేది కేంద్ర న్యాయ విభాగంలో అత్యున్నత పదవి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అంశాలకు సంబంధించి వాదనలు వినిపించాల్సి ఉంటుంది. హై ప్రొఫైల్ లో మంచి పదవి కూడా. న్యాయవర్గాల్లో ఈ పదవికి విశేష ఆదరణ ఉంది. అటువంటి పదవి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం అనేది గొప్ప విషయం గానే చెప్పవచ్చు. గతంలో గవర్నర్ పోస్ట్ ఇవ్వడంతో అశోక్ గజపతిరాజుకు వరించింది. త్వరలో మరో గవర్నర్ పోస్ట్ కూడా లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అడిషనల్ సొలిసిటర్ జనరల్ పోస్ట్ ఇవ్వడం ద్వారా మున్ముందు.. మరిన్ని పదవులు ఉంటాయని మాత్రం ప్రచారం నడుస్తోంది.