Homeఎంటర్టైన్మెంట్MAA Elections 2021: విష్ణు తెలివైన పనికి ప్రకాష్ రాజ్ కి పెద్ద దెబ్బే !

MAA Elections 2021: విష్ణు తెలివైన పనికి ప్రకాష్ రాజ్ కి పెద్ద దెబ్బే !

MAA Elections 2021
Prakash Raj & Manchu Vishnu in MAA Elections 2021

MAA Elections 2021: నటుడు, దర్శకుడు రవిబాబు రెగ్యులర్ సినిమా మనిషి కాదు, పైగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కి సంబంధించి గతంలో ఎప్పుడూ యాక్టివ్ గా లేడు. కానీ, ఉన్నట్టు ఉండి సడెన్ గా రవిబాబు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ‘మా’ సంస్థ మన కోసం మనం పెట్టుకున్నాం. మరి మన కోసం పని చేయడానికి మనలో ఒకడు కూడా పనికి రాడా?’ ఇది రవిబాబు స్పీచ్ లో ప్రధాన పాయింట్.

‘మా’ ఎన్నికల్లో (MAA Elections 2021)ఎక్కువగా ఓట్లు వేసేది చిన్నాచితకా నటీనటులే. తన సినిమాల్లో వాళ్ళను మాత్రమే పెట్టుకోవడం రవిబాబు ప్రత్యేకత. అందుకే చాలామంది చిన్న చిన్న నటీనటులు రవిబాబును ఎంతగానో గౌరవిస్తారు. ఇక్కడ మంచు విష్ణు తెలివిగా ముందుకు వెళ్ళాడు. ‘మా’ ఎన్నికల్లో ఓట్లు వేసే వారి బలహీనతల్లో ముఖ్యమైనది సినిమా అవకాశాలు.

ప్రకాష్ రాజ్ లాంటి నటులు చిన్న నటులకు ఎన్నడూ అవకాశం ఇప్పించిన సంఘటన లేదు. కానీ, రవిబాబు చాలా మందికి అవకాశాలు ఇచ్చాడు. అందుకే మంచు విష్ణు, రవిబాబును ఫ్రేమ్ లోకి తీసుకొచ్చాడు. అందుకు తగ్గట్టుగానే రవిబాబు స్పీచ్ కూడా చిన్న నటీనటులను ఎమోషనల్ గా కనెక్ట్ చేసేలా ఉంది. ఇంతకీ రవిబాబు ఏమి మాట్లాడాడు అంటే..

‘అందరికీ నమస్కారం, ఇది లోకల్‌ నాన్‌ లోకల్‌ వివాదం గురించి కాదు, నేను ఏదో ఒక ప్యానల్‌ కు ఓటు వేయండి అని కూడా చెప్పట్లేదు. మనకు చాలామంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ లు ఉన్నా.. సినిమాలు చేసే మన మన దర్శక నిర్మాతలు డబ్బింగ్ రైట్స్, అలాగే వేరే కొన్ని కారణాలు కారణంగా బయటవాళ్లకే ముఖ్యంగా వాళ్ల డిమాండ్‌ లకు ఒప్పుకొని మరీ ఎక్కువగా అవకాశాలిస్తున్నారు’ అని అన్నాడు. ఇది ప్రకాష్ రాజ్ లాంటి నటుల గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్పిందే.

MAA Elections 2021
Ravi Babu Comments on MAA Elections 2021

అలాగే రవిబాబు (Ravi Babu) ఇంకా మాట్లాడుతూ.. ‘అది వాళ్ళ అదృష్టం. మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల దురదృష్టం అనుకుందాం. కానీ కెమెరామెన్‌ లు, మేకప్‌ మేన్‌లు.. ఇలా సినిమాకు సంబంధించిన చాలా చిన్న చిన్న విభాగాల్లో కూడా బయటవాళ్లకే ఎక్కువ ఛాన్స్ లు ఇస్తున్నారు’ కచ్చితంగా ఇది నాన్ లోకల్ పై వ్యతిరేకతను పెంచడానికే రవిబాబు ఇలా మాట్లాడాడు.

‘సరే ఇవన్నీ పక్కన పెడితే.. నటీనటుల సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న సంస్థ ‘మా’. ఇది మన కోసం మనం పెట్టుకున్నాం. దీనికి కూడా మనం బయట నుంచే మనుషులను తెచ్చుకోవాలా ? ఇది మన సంస్థ.. మనం నడుపుకోలేమా? మనకి చేతకాదా? ఒక్కసారి ఆలోచించండి’ అంటూ రవిబాబు చాలా తెలివిగా ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా మాట్లాడాడు. రవిబాబు ఎంట్రీ విష్ణు చాలా ప్లస్ కానుంది. మొత్తానికి రవిబాబుతో విష్ణు తెలివిగా ప్రకాష్ రాజ్ ను దెబ్బ కొట్టాడు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper