Rathika Rose: బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ నాలుగో వారం ఎలిమినేటై ఇంటి బాట పట్టింది . ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తీరు, ఆమె కాన్ఫిడెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేసే టాస్క్ లో ప్రెజన్స్ ఆఫ్ మైండ్ తో అలోచించి టాస్క్ గెలిచి టైటిల్ ఫేవరెట్ ,పెద్దయ్యా ముద్దు బిడ్డ గా పేరు తెచ్చుకుంది. వరుసగా నాలుగు వారాలు నామినేషన్స్ లో ఉంది రతిక. మొదటి మూడు వారాలు ఆమె సేఫ్ అయింది . ఓట్లు కూడా బాగా పడ్డాయి ,స్ట్రాంగ్ కంటెస్టెంట్ కచ్చితంగా ఇంకా కొన్ని వారాలు ఉంటుంది అనుకునే లోపే ఎలిమినేటైంది రతిక .
ఇలా జరగడానికి కారణం స్వయంగా రతిక . ఆమె చేసిన తప్పులు ఎలిమినేషన్ కి కారణం గా నిలిచాయి . ఈమె హౌస్ లో పల్లవి ప్రశాంత్ ,ప్రిన్స్ యావర్ తో లవ్ ట్రాక్స్ నడిపింది .వారి ఇద్దరితో అంత మంచిగా ఉంటూ ,నమ్మించి వెన్నుపోటు పొడిచింది . అవసరానికి వాడుకుని వదిలేసింది. పవర్ అస్త్ర టాస్క్ లో ప్రశాంత్ ని నోటికొచ్చినట్టు తిట్టి అవమానించింది. ఈమె ప్రవర్తన చూసి ఆడియన్స్ అవాక్కయ్యారు. ఈమెకు ఇది పెద్ద మైనస్ పాయింట్ అయింది . ఎలిమినేషన్ కి కారణం కూడా ఇదే .
ఆడియన్స్ లో ఈమె గురించి నెగిటివిటీ స్ప్రెడ్ అయింది . దారుణంగా ట్రోల్స్ చేస్తూ ,నెగిటివ్ కామెంట్స్ చేశారు నెటిజన్స్ . బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన రతిక రోజ్ తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టింది. అది వైరల్ గా మారింది . థాంక్యూ ఎవ్రీ వన్ . డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ . దేర్ వజ్ మచ్ మోర్ దెన్ వాట్ యు సా అని చెప్పింది . షో లో నన్ను చూసి అంచనాకి రావద్దు . మీరు చూసిన దానికంటే మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉందని దాని అర్థం.
మీరు షోలో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు జరిగింది వేరు అని తనని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తున్న నేపథ్యంలో ఆమె ఈ రకంగా వివరణ ఇచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది .
View this post on Instagram