Rashmika Mandana: స్టార్ యాంకర్ రష్మీ ప్రస్తుతం మాల్దీవ్స్ వెకేషన్ లో ఉన్నారు. షూటింగ్స్, మీటింగ్స్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే రష్మీకి విరామం దొరికినట్టుంది. ప్రశాంతమైన దీవుల దేశం చెక్కేసింది. అందమైన సాగర తీరంలో హ్యాపీగా సేద తీరుతుంది. మరి సముద్ర తీరం అంటే జలకాలు వెరీ కామన్. దీంతో హాట్ స్విమ్ వేర్ ధరించి రష్మీ రచ్చ చేస్తున్నారు. తన వెకేషన్ ఫోటోలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక రష్మీ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కామెంట్స్, లైక్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.

రష్మీ లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ ఇటీవల విడుదలైంది. నందు హీరోగా నటించిన ఈ చిత్ర ప్రమోషన్స్ గట్టిగా చేశారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం విడుదల కావాల్సిన చిత్రాన్ని ఎట్టకేలకు థియేటర్స్ లోకి తెచ్చారు. బొమ్మ బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. దీంతో హీరోయిన్ గా హిట్టు కొట్టాలన్న ఆమె కల నెరవేరలేదు. ఒక దశలో రష్మీ వరుసగా లీడింగ్ లేడీగా సినిమాలు చేశారు. పరాజయాలు ఎదురు కాగా ఆఫర్స్ తగ్గాయి.
దీంతో సిల్వర్ స్క్రీన్ ఆశలు వదిలేసి బుల్లితెర పై బిజీ అయ్యారు. ఏళ్ల తరబడి జబర్దస్త్ షో యాంకర్ గా రష్మీ కొనసాగుతున్నారు. అనసూయ జబర్దస్త్ మానేయడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ షోకి యాంకర్ గా చేసే అవకాశం దక్కింది. కొన్ని నెలల పాటు హ్యాపీగా రెండు షోస్ కి యాంకరింగ్ చేస్తూ డబుల్ రెమ్యూనరేషన్ ఆర్జించింది. తాజాగా సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇవ్వడంతో అమ్మడు జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సివచ్చింది.

అయినప్పటికీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేస్తున్నారు. బుల్లితెరపై ఆమెకు తిరుగు లేదు. అడపాదడపా వెండితెర ఆఫర్స్ చేసుకుంటూ బుల్లితెరపై రాణించాలని ఫిక్స్ అయ్యారు. ఐతే గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మీ సుమ మాదిరి ఏళ్ల తరబడి రాణించడం కష్టమే. యవ్వనం ఉన్నన్నాళ్ళే ఆమెకు డిమాండ్. వయసు మీద పడ్డాక అవకాశాలు రాకపోవచ్చు.

అందుకే ఫేమ్ నేమ్ ఉన్నప్పుడే మంచి సౌండ్ పార్టీని పెళ్లి చేసుకొని సెటిల్ అవడం బెటరని ఆమెకు పలువురు సలహాలు ఇస్తున్నారు. 35 ఏళ్లు వచ్చాక ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదంటున్నారు. పొరపాటున ఫేడ్ అవుటైతే మన మీద ఆధారపడే వాళ్లే కానీ మనకు ఆధారంగా నిలిచే భాగస్వాములు దొరకడం కష్టం. మరోవైపు సుడిగాలి సుధీర్-రష్మీ రిలేషన్ పై సందిగ్ధత కొనసాగుతుంది. ఏజ్ బారైనా ఇద్దరూ పెళ్లి మాట ఎత్తడం లేదు. దీంతో వారిద్దరూ లాక్ అవుతారేమో అనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.