Photo Talk: ఎక్స్ పోజింగ్ కి ఆమడ దూరం. మేకప్ అన్నా పడదు. పాత్ర నచ్చితేనే సినిమా చేస్తుంది. గొప్ప డాన్సర్. యాడ్స్ లో నటించదు. సోషల్ మీడియాలో అంతంత మాత్రమే. హీరోయిన్స్ నందు నా రూట్ సపరేట్ అంటుంది. పెద్దగా అందగత్తె కాకపోయినా రాణిస్తున్న ఈ అమ్మడు ఎవరో పోలికలను బట్టి అర్థమయ్యే ఉంటుంది. ఈ క్యూట్ బేబీ ఎవరో కాదు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఐదారేళ్ళ ప్రాయంలో స్కూల్ యూనిఫార్మ్ లో నవ్వులు పూయిస్తున్న సాయి పల్లవి త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు ఆమెను గుర్తు పట్టలేకపోయారు. అభిమానులు మాత్రం ఈమె మా డార్లింగ్ సాయి పల్లవి అని టక్కున చెప్పేస్తున్నారు.

కేవలం టాలెంట్ తో హీరోయిన్ గా ఎదిగింది సాయి పల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ గా మారిన సాయి పల్లవికి ఆ సినిమా పూర్తి అయ్యేవరకు కూడా సందేహాలేనట. నేను పెద్ద అంతగత్తెను కాదు నన్ను హీరోయిన్ గా ఉంచుతారా? లేక మధ్యలో తీసేస్తారా? అని మదనపడుతూ ఉండేదట. చాలా సార్లు ఆ చిత్ర దర్శకుడిని ఇదే ప్రశ్న అడిగారట. ప్రేమమ్ సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసింది. ఫిదా మూవీలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ కథ సాయి పల్లవి చుట్టే తిరుగుతుంది. హీరోయిన్స్ పాత్రలను చాలా బలంగా చూపించే శేఖర్ కమ్ముల లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నట్లు ఫిదా రూపొందించారు. తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలంగాణ మాండలికం నేర్చుకొని డబ్బింగ్ చెప్పుకుంది. సాయి పల్లవి నటన, డాన్స్ ప్రేక్షకులకు మెస్మరైజ్ చేశాయి.

ఇక సాయి పల్లవి గత రెండు చిత్రాలు లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సూపర్ హిట్ అయ్యాయి. విరాటపర్వం నిరాశపరిచినప్పటికీ ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. డిమాండ్ ఉండి కూడా సాయి పల్లవి సడన్ గా చిత్రాలు తగ్గించారు. ఆమె లేటెస్ట్ రిలీజ్ గార్గి. ఈ మూవీ తర్వాత సాయి పల్లవి ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. సాయి పల్లవి చిత్రాలు చేస్తూ వెండితెరపై అలరించాలని వారు కోరుకుంటున్నారు.