Rashmika Mandanna: ప్రస్తుతం నేషనల్ వైడ్ గా నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు అంటే, కళ్ళు మూసుకొని రష్మిక మందాన(Rashmika Mandanna) పేరు చెప్పేయొచ్చు. ఈమె సాధిస్తున్న విజయాలను చూస్తే ఎవరైనా ఆమె నెంబర్ 1 అని ఒప్పుకోక తప్పదు. కన్నడ సినీ పరిశ్రమ నుండి మన టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఈ స్థాయికి చేరుకుంటుందని బహుశా ఆమె కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. తెలుగు లో వరుసగా సూపర్ హిట్స్ ని అందుకొని అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న రష్మికకు పుష్ప చిత్రం తో నేషనల్ వైడ్ గా పాపులారిటీ వచ్చింది. పుష్ప తర్వాత వెంటనే సందీప్ వంగ తన ‘యానిమల్'(Animal Movie) సినిమాలో హీరోయిన్ గా తీసేసుకున్నాడు. అప్పటికే ఆయన పరిణీతి చోప్రా ని హీరోయిన్ గా ఎంపిక చేసుకొని ఉన్నాడు. కానీ ‘పుష్ప'(Pushpa Movie) లో రష్మిక నటన చూసిన తర్వాత పరిణీతి ని తప్పించి ఈమెను ఎంచుకున్నాడు.
ఈ సినిమా బాలీవుడ్ లోనే కాదు, సౌత్ లో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దాదాపుగా 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘పుష్ప 2 ‘(Pushpa 2 Movie) చిత్రం 1800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, రీసెంట్ గా విడుదలైన ‘చావా'(Chhaava Movie) చిత్రం 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తుంది. ఇలా ఈ మూడు సినిమాలకు వచ్చిన థియేట్రికల్ గ్రాస్ ని కలిపితే 3400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్(Salman Khan) తో ‘సికిందర్'(Sikindar Movie) అనే చిత్రం చేస్తుంది. బాలీవుడ్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రమిది. కచ్చితంగా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటుంది అనే నమ్మకం అభిమానుల్లోనూ, ట్రేడ్ లోనూ ఉంది.
ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మరో వెయ్యి కోట్ల రూపాయిల సినిమా రష్మిక ఖాతాలో చేరినట్టే. కరోనా లాక్ డౌన్ తర్వాత ఏ హీరోయిన్ కి కూడా ఇన్ని వేల కోట్ల రూపాయిల గ్రాస్ రాలేదు. దీపికా పదుకొనే(Deepika Padukone), కత్రినా కైఫ్(Katrina Kaif), అలియా భట్(Alia Bhatt) వంటి లేడీ సూపర్ స్టార్స్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ హీరోయిన్స్ రష్మిక కి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. దీనిని బట్టే చెప్పొచ్చు, రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ 1 హీరోయిన్ అనేది. త్వరలోనే ఈమె రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక రష్మిక ని అందుకోవడం ఎవరి తరం కాదు.