Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ మే 9న పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. జన్మదినం సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కానీ రష్మిక మందన విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ చెప్పలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్మిక – విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారని చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. రష్మిక ప్రియుడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
విజయ్ దేవరకొండ,రష్మిక మందన గీత గోవిందం సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చేశారు. ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. తరచుగా విజయ్ దేవరకొండ-రష్మిక మందాన వెకేషన్స్ కి వెళుతుంటారు. మాల్దీవ్స్ వీరికి ఇష్టమైన టూరింగ్ స్పాట్. ఘాడంగా ప్రేమించుకున్న ఈ స్టార్ కపుల్ ఏదో ఒకరోజు పెళ్లి ప్రకటన చేస్తారనే వాదన ఉంది.
గత ఏడాది తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విజయ్ దేవరకొండకు రష్మిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈసారి ఎలాంటి స్టేటస్ పెట్టలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తోంది. విజయ్-రష్మిక బ్రేకప్ చెప్పుకున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అదేం లేదు, తమపై వస్తున్న పుకార్లు చెక్ పెట్టేందుకు రష్మిక విష్ చేయలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నిజం ఏమిటో కాలమే తేల్చాలి.
ఇక విజయ్ కెరీర్ విషయానికొస్తే .. ఏడేళ్లుగా సరైన హిట్ పడక స్ట్రగుల్ అవుతున్నాడు. ఓ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ ఏకంగా మూడు సినిమాలు ప్రకటించారు. ఇవి డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కనున్నాయి. వీటికి సంబంధించిన పోస్టర్స్ ఆసక్తిని రేపుతున్నాయి. ఇక రష్మిక చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలు ఉన్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్ ‘ సికందర్ ‘ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.