Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలంతా పాన్ ఇండియా హీరోలుగా మారి మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక గత మూడు సంవత్సరాల క్రితం మన తెలుగు హీరోలు తెలుగు వరకే పరిమితమయ్యారు. కానీ కరోనా తర్వాత నుంచి మన హీరోలు కూడా పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు.
ఇక అందులో భాగంగానే పాన్ ఇండియాలో కూడా తెలుగు సినిమాల హవాని కొనసాగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తలుచుకుంటే ఇప్పటికీ ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేవాడు కానీ తను తెలుగు కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇక ఇప్పుడు సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజి సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని అందుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే దానిపైన ఇప్పుడు చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.
ఇక ఇంతకుముందు తను బ్రో సినిమా కోసం రోజుకు రెండు కోట్ల చొప్పున రిమ్యూనరేషన్ తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ జి సినిమా కోసం దాదాపు 150 కోట్లు రెమ్యూనిరేషన్ ని తీసుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. పాన్ ఇండియా లో ఆయనకి పెద్దగా మార్కెట్ అయితే లేదు. అయిన కూడా పవన్ కళ్యాణ్ కి 150 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన డి వి వి దానయ్య పవన్ కళ్యాణ్ ఎంత అడిగితే అంత ఇస్తాను కానీ తనకు ఒక సినిమా మాత్రం చేసి పెట్టమని చెప్పారట. ఇక అందుకే పవన్ కళ్యాణ్ ఈ సినిమాని దానయ్య బ్యానర్ లో చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతాడు. అలాగే ఆయన మార్కెట్ కూడా ఇంకా భారీ స్థాయిలో పెరిగే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల వరకు బడ్జెట్ ను పెడుతున్నారట..ఈ సినిమా తేడా కొడితే దానయ్య పరిస్థితి ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…