Jabardasth Nukaraju: లవర్ ముందు అడ్డంగా బుక్ అయిన జబర్దస్త్ నూకరాజు… మొబైల్ ఓపెన్ చేస్తే బండారం బట్టబయలు!

చాలా కాలంగా ఆసియా, నూకరాజు ప్రేమించుకుంటున్నారు. గతంలో ఆసియా నూకరాజుతో కలిసి జబర్దస్త్ స్కిట్స్ కూడా చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

Written By: S Reddy, Updated On : May 10, 2024 4:45 pm

Asiya find out Jabardasth Nukaraju chatting with another girl

Follow us on

Jabardasth Nukaraju: జబర్దస్త్ వేదికగా ఎంతో మంది కమెడియన్స్ ఫేమ్ రాబట్టారు. తమ టాలెంట్ తో బుల్లితెర సెలెబ్రెటీలు ఎదిగారు. అలాంటి వారిలో కమెడియన్ నూకరాజు ఒకరు. పటాస్ షోతో నూకరాజు బుల్లితెరకు పరిచయం అయ్యాడు. అనంతరం జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చాడు. అలరించే కామెడీ స్కిట్స్ చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకుంటున్నాడు. బుల్లితెరపై తనదైన హాస్యం తో నవ్వులు పూయిస్తున్నాడు. కాగా నూకరాజు ఆసియా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

చాలా కాలంగా ఆసియా, నూకరాజు ప్రేమించుకుంటున్నారు. గతంలో ఆసియా నూకరాజుతో కలిసి జబర్దస్త్ స్కిట్స్ కూడా చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఎక్కువగా తన ప్రియుడు నూకరాజుతో ఫన్నీ వీడియోస్, ప్రాంక్ లు చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఆమె చేసిన ప్రయోగం ఒకటి బెడిసికొట్టింది. ఏదో చేయాలి అనుకుంది కానీ చివరకు అది గొడవకు దారి తీసింది.

ఈ జంట లవ్ టుడే మూవీ కాన్సెప్ట్ ఫాలో అయ్యారు. ఈ ఒకరి ఫోను మరొకరు మార్చుకున్నారు. ఇక నూకరాజు ఫోన్ తీసుకున్న ఆసియా అతన్ని ఫోర్స్ చేసి ఇన్ స్టాగ్రామ్, పేస్ బుక్ పాస్ వర్డ్ తెలుసుకుంది.తర్వాత ఫోన్ మొత్తం చెక్ చేసింది.ఈ క్రమంలో ఒక అమ్మాయి ‘ఓయ్ నూకరాజు .. హే రిప్లై ఇవ్వు’ అంటూ మెసేజ్ చేసింది. దీంతో ఆసియా నూకరాజుని నిలదీసింది. ఎంత క్లోజ్ కాకపోతే ఆ అమ్మాయి అలా మెసేజ్ చేసిందని నిలదీసింది.

దీంతో నూకరాజు నేను రిప్లై ఇవ్వలేదు కదా ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు అంటూ ఫైర్ అయ్యాడు. ఏడుస్తూనే ఆసియా ఫేస్ బుక్ చెక్ చేసింది. అక్కడ కూడా అదే అమ్మాయి పదే పదే మెసేజ్ లు పెట్టడం చూసి తెగ ఏడ్చేసింది. నీకు అమ్మాయికి ఏదో సంబంధం ఉంది అంటూ గోల చేసింది. లేకపోతే ఎందుకు మెసేజ్ చేస్తుంది అని ఫీలైంది. ఈ మాటలకు నూకరాజు కోపంగా మైక్ తీసి విసిరికొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వీడియో అయిపోయింది నూకరాజుని బతిమిలాడుకోవాలి అని ఆసియా చెప్తూ కూడా వెనకాలే వెళ్లింది.