Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: తన డైట్‌ వీడియో పోస్ట్ చేసిన 'రష్మిక మండన్నా'...

Rashmika Mandanna: తన డైట్‌ వీడియో పోస్ట్ చేసిన ‘రష్మిక మండన్నా’ !

Rashmika Mandanna: క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’కి బాలీవుడ్ లో రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లోకి టాప్ హీరోయిన్ గా దూసుకువచ్చేసిన ఈ బ్యూటీకి, అటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్‌ క్రష్‌ అనే బిరుదుతో తెలుగుతో పాటు పాన్‌ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతూ ముందుకు పోతుంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

మొత్తానికి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ భారీ విజయంతో వచ్చిన జోరు కూడా ఈ కన్నడ భామకి బాగా కలిసి వచ్చింది. పైగా రష్మిక అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అసలు తన అందం కోసం రోజూ రష్మిక ఏం తింటుంది ? ఐతే, తాజాగా తన డైట్‌ ప్లాన్‌ గురించి చెప్పింది ఈ బ్యూటీ. అసలు షూటింగ్‌ లో నేను ఏం తింటానంటే.. అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది.

Also  Read: Anushka Shetty: మళ్లీ వైరల్ అవుతోన్న అనుష్క పెళ్లి పుకారు.. వరుడు అతనే !

ఈ వీడియోలో రష్మిక మొదట కోల్డ్‌ కాఫీ, సెలరీ జ్యూస్‌ని తాగింది. తర్వాత భోజనం బాదం వెన్నతో కూడిన ఓట్స్‌, సాయంత్రం టీ తాగింది. రాత్రి భోజనంలో చికెన్‌, బంగాళదుంపలను తీసుకుంది. ఇక ఇప్పటికే రష్మిక బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ చిత్రంలోనూ అలాగే అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘గుడ్ బై’ సినిమాలోనూ రష్మిక నటిస్తోంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

‘మిషన్ మజ్ను’ ఆల్ రెడీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రెండో సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. అలాగే రష్మికకు మాత్రం మరో బాలీవుడ్ సినిమా చేయమని ఆఫర్ వచ్చిందట. తాజాగా అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో మూడో సినిమా ఒప్పుకున్నట్లు హింట్ ఇచ్చింది రష్మిక. అయితే ఆమె చేస్తోన్న మూడో సినిమాలో హీరో ఎవరు, దర్శకుడు ఎవరు లాంటి సినిమా డీటెయిల్స్ గురించి ఏమి వెల్లడించలేదు.

ఇంతకీ రష్మికకు వస్తోన్న హిందీ అవకాశాలు వెనుక ఉన్న కారణం సౌత్ మార్కెట్. రష్మికను తమ సినిమాలో పెట్టుకుంటే.. సౌత్ నుండి మార్కెట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. మొత్తానికి ఇటు తమిళంలో కూడా మొదటి ఆప్షన్ రష్మికనే కావడం విశేషం.

Also  Read:Kangana Ranaut: స్టార్ హీరోలను అందుకే రిజెక్ట్ చేసిందట !

Recommended Videos:

Shahrukh Khan in Depression || Pathan Movie Opening Collection || Oktelugu Entertainment

Nikhil Emotional Words About Her Father || Nikhil Father Shyam Siddharth Passed Away

Top Viewed Movies in Amazon Prime || Top Rated Movie in Amazon Prime || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

3 COMMENTS

  1. […] Pushpa 2: ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పాన్ ఇండియా సినిమాలలో ఒక్కటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా..ఈ సినిమా పై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ కోలీవుడ్ మరియు బాలీవుడ్ వంటి ఇండస్ట్రీలలో ఎలాంటి అంచనాలు లేవు..ఇతర రాష్ట్రాలలో అతి తక్కువ అంచనాల మధ్య విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది..ముఖ్యంగా బాలీవుడ్ జనాలు అయితే అల్లు అర్జున్ యాక్టింగ్ కి సుకుమార్ టేకింగ్ కి ఫిదా అయ్యిపోయారు..క్రికెటర్స్ దగ్గర నుండి రాజకీయ నాయకులూ వరుకు ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ మేనియా లో మునిగిపోయారు..ఎక్కడ చేసిన తగ్గేదేలే అంటూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా లో పోస్టింగ్ లు పెడుతూ ఇప్పటికి హల్చల్ చేస్తూనే ఉన్నారు..ఇంతతి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకి అతి త్వరలోనే సీక్వెల్ రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దీనికి సంబంధించిన లేటెస్ట్ వార్త ఒక్కటి సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది. […]

  2. […] Samantha: నేటి తరం హీరోయిన్స్ లో అందం తో పాటుగా అభినయం కనబరిచే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో సమంత ఒక్కరు..ఎప్పుడు కొత్తదనం కోరుకునే సమంత కేవలం హీరోయిన్స్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా నేటి తరం ఆకట్టుకునే విధంగా విభిన్నమైన పాత్రలను సైతం వెయ్యడానికి సిద్ధం అయ్యిపోతుంది..నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమంత ఇప్పుడు టాలీవుడ్ , కోలీవుడ్ మరియు బాలీవుడ్ లలో వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతుంది..ఇటీవలే ఆమె హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘కాదువాకల రెండు కాదల్’ మంచి పాజిటివ్ రివ్యూస్ ని సంపాదించుకొని సమంత కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..విజయ్ సేతుపతి హీరో గా నటించిన ఈ సినిమాలో నయనతార మరో హీరోయిన్ గా నటించింది..నయనతార కాబొయ్యే భర్త విగ్నేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మంచి కామెడీ ఎంటర్టైనర్ గా జనాలను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. […]

Comments are closed.

Exit mobile version