Kangana Ranaut: ‘కంగనా రనౌత్’ గురించి ఏమి అని చెప్పాలి ? ఎంత అని చెప్పాలి ? ఆమె ఎక్కడ ఉంటే అక్కడ అంతా కాంట్రవర్సీ మయం అయిపోతుంది. కంగనా అసలు ఎదిగింది వివాదాలపై. అందుకే ఆమెకు వివాదం అంటే బాగా ఇష్టం. మాట్లాడే ప్రతి మాటలో ఒక బోల్డ్ స్టేట్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే కంగనా స్టేట్ మెంట్స్ కోసం ట్రోలర్స్ కూడా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఐతే.. తాజాగా కంగనా పాజిటివ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల కొన్నిరోజులుగా ఉత్తర, దక్షిణాది నటుల మధ్య హిందీ భాషా వివాదం చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై, బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీనే మన జాతీయ భాష అని స్పష్టం చేసింది. అప్పటికీ, ఇప్పటికీ, ఇంకెప్పటికైనా హిందీనే జాతీయ భాష అంటూ ట్వీట్ చేసిన అజయ్ దేవగణ్ కు మద్దతు పలికింది.
Also Read: Trivikram Srinivas: త్రివిక్రమ్ సినీ కెరీర్ లో బెస్ట్ డైలాగ్స్ ఇవే !
హిందీని జాతీయ భాషగా అంగీకరించకపోవడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని పేర్కొంది. ప్రస్తుతం యాక్షన్‌తో ఏజెంట్ అగ్నిగా అదరగొడుతోంది కంగనా రనౌత్. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ధాకడ్’. రజ్నీష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘మానవ అక్రమ రవాణాపై పంజా విసిరే గూఢచారిగానే కాదు.. బార్ డ్యాన్సర్‌గా, సెక్స్‌వర్కర్‌గా, హోస్ట్‌గా.. ఇలా విభిన్న పాత్రల్లో కంగనా దర్శనమిచ్చింది. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ లో కంగనా షాకింగ్ కామెంట్స్ చేసింది. మేల్ సెంట్రిక్ చిత్రాలను తిరస్కరించడం, అవార్డు ఫంక్షన్లకు దూరంగా ఉండటం వంటి రిస్క్ తీసుకోవడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగినట్లు కంగనారనౌత్ తెలిపింది.
తాను నటించిన ధాకడ్ మూవీ ట్రైలర్ లాంచ్‌లో మాట్లాడుతూ.. ‘ఖాన్, అక్షయ్ వంటి పెద్ద హీరోల సినిమాలు చేయనన్నప్పుడు అందరూ నన్ను విమర్శించేవారు. కానీ భవిష్యత్తు పట్ల పూర్తి విజన్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు’ అని పేర్కొంది.
Also Read:Bigg Boss Telugu OTT: అషురెడ్డికి షాకిచ్చిన అఖిల్ మదర్? బిగ్ బాస్ షోలో ఇదే వైరల్
Recommended Videos:



[…] Hari Hara Veera Mallu: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ప్రత్యేకమైన సాంగ్ ను ప్రస్తుతం ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి రాసినట్టు తెలిపారు. ఇది అద్భుతమైన ప్రేమ గీతం అని కీరవాణి చెప్పారు. […]