Playback Movie: అంత గొప్ప సినిమా ఎందుకు హిట్ కాలేదు.. ఇప్పటికీ డౌటే ?

Playback Movie: గత ఏడాది వచ్చిన ప్లే బ్యాక్ అనే ఒక సినిమా ప్రస్తుతం నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటుంది. మరి, నిజంగానే ఈ సినిమా అంత బాగుందా ? నిజానికి ఈ సినిమా మొదటిసారి భారత దేశంలో ఒక “క్రాస్ టైం కనెక్షన్” అనే అంశంపై తెరకెక్కింది. (అంటే వేరు వేరు కాలంలో ఉండే వాళ్ళు ఫోన్ లలో మట్లాడుకోవడం). ఈ సినిమాలో పెద్ద నటులు ఎవరు లేరు కాబట్టి, జనాలకి ఈ సినిమా మీద […]

Written By: Shiva, Updated On : April 30, 2022 7:45 pm
Follow us on

Playback Movie: గత ఏడాది వచ్చిన ప్లే బ్యాక్ అనే ఒక సినిమా ప్రస్తుతం నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటుంది. మరి, నిజంగానే ఈ సినిమా అంత బాగుందా ? నిజానికి ఈ సినిమా మొదటిసారి భారత దేశంలో ఒక “క్రాస్ టైం కనెక్షన్” అనే అంశంపై తెరకెక్కింది. (అంటే వేరు వేరు కాలంలో ఉండే వాళ్ళు ఫోన్ లలో మట్లాడుకోవడం). ఈ సినిమాలో పెద్ద నటులు ఎవరు లేరు కాబట్టి, జనాలకి ఈ సినిమా మీద ఆశక్తి కలగలేదు.

Playback Movie

అందువల్లనే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, ఈ సినిమా చాలా బాగుంది.‌ ఈ సినిమాలో జరిగినట్లు నిజజీవితంలో జరగదు కాబట్టి, కొంత అవాస్తవంగా అనిపించినా కూడా చాలా బాగా వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా 90 కాలం వ్యక్తికి ఇప్పుడు ఉన్న వ్యక్తికి ఫోన్ లో జరిగే సంభాషణ మీద ఈ సినిమా కథ ఆధారపడి సాగుతుంది.

Also Read: Rashmika Mandanna: తన డైట్‌ వీడియో పోస్ట్ చేసిన ‘రష్మిక మండన్నా’ !

ఈ సినిమా మొదటిసారి చూసినప్పుడు కథ మనం అస్సలు ఊహించే రకంగా ఉండదు. మనము అనుకునే దానికి వేరుగా జరుగుతుంది. కాకపోతే.. ఈ సినిమా చివరిలో డిఫరెంట్ గా తీసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఐతే, లాజిక్ పక్కన పెట్టి ఈ సినిమా గనక చూస్తే.. అన్ని సినిమాల కంటే కొంచెం వేరే రకంగా అనిపిస్తుంది.

Playback Movie

ఈ సినిమా చూసిన తర్వాత చాలా సందేహాలు మన మెదడులో తిరుగుతాయి. వాటికి సమాధానం దొరకకపోవచ్చు. కానీ సినిమా మొత్తంగా మిమ్మల్ని అలరింప చేస్తుంది. సినిమా అయ్యాక కూడా దీంట్లో జరిగే దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు.

ఇంతగా ప్రభావం చూపిన ఈ సినిమా ఎందుకు పెద్దగా థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడలేదో ?, సరే థియేటర్స్ లో ఆడకపోయినా రావాల్సిన స్థాయిలో ఎందుకు ప్రసిద్ధి చెందలేదో అనేది ఇప్పటికీ డౌటే.

Also Read:Kangana Ranaut: స్టార్ హీరోలను అందుకే రిజెక్ట్ చేసిందట !

Recommended Videos:

Tags