https://oktelugu.com/

Chiranjeevi: ప్రభాస్ వదులుకున్న సినిమాని చెయ్యబోతున్న మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: 7 పదుల వయసు కి దగ్గర పడుతున్న కూడా మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు..ఈ ఏడాది ఆయన హీరో గా నటించిన ఆచార్య సినిమా విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్య పాత్రలో నటించాడు..తొలి సారి తండ్రీకొడుకులు ఒక్కే సినిమాలో నటించడం తో ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2022 / 04:14 PM IST
    Follow us on

    Chiranjeevi: 7 పదుల వయసు కి దగ్గర పడుతున్న కూడా మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు..ఈ ఏడాది ఆయన హీరో గా నటించిన ఆచార్య సినిమా విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్య పాత్రలో నటించాడు..తొలి సారి తండ్రీకొడుకులు ఒక్కే సినిమాలో నటించడం తో ఈ మూవీ పై మెగా అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు..కానీ ఆ ఆలా పై కొరటాల శివ నీళ్లు చల్లాడు..మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలు చేస్తే ఏనాడు కూడా ఇంత చెత్త సినిమా చెయ్యలేదని కొరటాల శివ ని మెగా అభిమానులు బాండ బూతులు తిట్టారు..రీ ఎంట్రీ తర్వాత మొదటిసారి భారీ డిజాస్టర్ ఫ్లాప్ రావడం తో మెగాస్టార్ చిరంజీవి స్క్రిప్ట్స్ ఎన్నికల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన మలయాళం మూవీ రీమేక్ గాడ్ ఫాదర్ ఈ దసరా కానుకగా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్నది.

    Chiranjeevi

    Also Read: Raashi Khanna: తిరుమలలో రాశీ ఖన్నా షాకింగ్ లుక్.. అలా ఎలా వెళ్ళింది ?

    ఇది ఇలా ఉండగా ఇటీవల కమల్ హాసన్ తో విక్రమ్ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..విక్రమ్ మూవీ టీం సక్సెస్ సెలెబ్రేషన్స్ కోసం హైదరాబాద్ కి వచ్చినప్పుడు చిరంజీవి గారు కమల్ హాసన్ మరియు లోకేష్ కనకరాజ్ ని తన ఇంటికి పిలిపించుకొని విందు ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ విందుకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో ఇప్పటికి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది..అయితే ఈ డిన్నర్ లో లోకేష్ కనకరాజ్ ని తన తో సినిమా చెయ్యొచ్చు కదా అని చిరంజీవి అయిగినట్టు సమాచారం..’గతం లో ప్రభాస్ కోసం ఒక స్క్రిప్ట్ రాసుకున్నావు కదా..ఎందుకో ప్రభాస్ ఆ సినిమా రిజెక్ట్ చేసాడు..కానీ నేను ఆ కథ విన్నాను..నాకు బాగా నచ్చింది..కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకొని మనిద్దరం చేద్దాము’ అంటూ లోకేష్ కనకరాజ్ ని అడిగాడట చిరంజీవి..లోకేష్ కనకరాజ్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..ప్రస్తుతం లోకేష్ తమిళ స్టార్ హీరో విజయ్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా తర్వాతనే చిరంజీవి తో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

    Lokesh Kanagraj

    Also Read: NTR Sensational Decision: స్క్రిప్ట్ విషయం లో కొరటాల గందరగోళం..సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్

    Tags