https://oktelugu.com/

Rashmika Mandanna Marriage: ‘రష్మిక మందన్నా’ పెళ్లి పై కొత్త పుకార్లు

Rashmika Mandanna Marriage: క్రేజీ హీరోయిన్ ‘రష్మిక మందన్నా’ పెళ్లి టాపిక్ మళ్ళీ వైరల్ అవుతుంది. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమెకు మంచి విజయాలు కూడా వస్తున్నాయి. దాంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి సడెన్ గా పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. ? 2022లో రష్మిక మందన్నా ఏ సినిమాలు చేస్తోందో క్లారిటీ లేదు. పైగా ఈ ఏడాది ఇప్పటివరకు ‘రష్మిక మందన్నా’ మరో తెలుగు […]

Written By: , Updated On : February 28, 2022 / 04:16 PM IST
Follow us on

Rashmika Mandanna Marriage: క్రేజీ హీరోయిన్ ‘రష్మిక మందన్నా’ పెళ్లి టాపిక్ మళ్ళీ వైరల్ అవుతుంది. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమెకు మంచి విజయాలు కూడా వస్తున్నాయి. దాంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి సడెన్ గా పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. ? 2022లో రష్మిక మందన్నా ఏ సినిమాలు చేస్తోందో క్లారిటీ లేదు. పైగా ఈ ఏడాది ఇప్పటివరకు ‘రష్మిక మందన్నా’ మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు.

Rashmika Mandanna

Rashmika Mandanna

ఇంకా రష్మిక మందన్నా ఏ తెలుగు సినిమా సైన్ చెయ్యలేదు కాబట్టి.. బహుశా ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించారు. దాంతో తాజాగా ఈ బ్యూటీ తన పెళ్లి గురించి తన మనసులో మాటని బయట పెడుతూ అందరికీ క్లారిటీ ఇచ్చింది. తనకు 30 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది.

Also Read:  ఓటీటీలోకి ‘రామారావు ఆన్ డ్యూటీ’

అయితే, తాను ప్రస్తుతం తెలుగు సినిమాలను కొత్తగా అంగీకరించక పోవడానికి ప్రధాన కారణం హిందీ సినిమాలతో బిజీగా ఉండటమేనట. ఇక రష్మిక మందన్నాకి 25 ఏళ్ళు. అంటే రష్మిక మందన్నా లెక్క ప్రకారం ఇంకో మరో ఐదేళ్ల తర్వాత ఆమె తన పెళ్లి గురించి ఆలోచిస్తుంది అన్నమాట. ఏది ఏమైనా రష్మిక మందన్నా వ్యక్తిత్వం చిన్న పిల్లలా ఉంటుందని టాక్ ఉంది.

కాగా రష్మిక మందన్నా ప్రేమాయణం గురించి గతంలోనే అనేక రూమర్స్ వచ్చాయి. ఒక కన్నడ హీరోతో ఆమె ప్రేమలో పడింది. రష్మిక మందన్నాకి ఉన్న మరో మంచి లక్షణం ఆమె చాలా సెన్సిటివ్. చిన్న విషయాలకు కూడా ఆమె ఎమోషనల్ అయిపోతారు. ఇటీవల జరిగిన ఓ ప్రీ రిలీజ్ వేడుకలో ఆమె స్పీచ్ చూస్తే అర్థమవుతుంది. రష్మిక మందన్నా తీరు చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Rashmika Mandanna

Rashmika Mandanna

ఈమెది ఇంత ప్యూర్ హార్ట్ ఏంట్రా బాబు అంటూ ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంత సెన్సిటివ్, ఓపెన్ మైండెడ్ గా ఉండే రష్మిక పరిశ్రమలో ఎలా సక్సెస్ అవుతున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో సున్నితంగా ఉండేవారు అసలు రాణించలేరు. ఎందుకంటే తప్పున్నా లేకున్నా కొన్ని సార్లు అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖస్తుతి, లౌక్యం చాలా అవసరం. రష్మిక మందన్నా వీటన్నింటికి అతీతంగా రాణిస్తూ… తాను చాలా ప్రత్యేకమని నిరూపించుకుంటుంది. ఈ తరం హీరోయిన్స్ లో రష్మిక మందన్నా చాలా ప్రత్యేకం.

Also Read: పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో మరోసారి ఘనంగా తెలిసింది

Tags