Bheemla Nayak Box Office Collection: కరెక్ట్ సినిమా పడాలే గానీ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్ లో ఊచకోత కోస్తాడో గతంలోనే చూశాం. అయితే ఇప్పుడు భీమ్లానాయక్ విషయంలో అది మరోసారి నిరూపితం అయింది. పవన్, రానా నటించిన ఈ మూవీ తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అభిమానులు ఏం కోరుకున్నారో.. ఈ మూవీతో అది పవన్ కల్యాణ్ ఇచ్చేశాడు. ఇంకేముంది లెక్కలు తారుమారవుతున్నాయి.
ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.100కోట్ల మార్కును చేరుకుంది. అసలే కరోనాతో అభిమానులు థియేటర్లకు వస్తారో రారో అనే టెన్షన్ తో పాటు.. ఏపీలో టికెట్ల రేట్లు తగ్గించడం మరో పెద్ద ఇబ్బంది. ఈ రెండింటినీ దాటుకుని పవన్ మూవీ దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100కోట్ల మార్కును చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్
దీంతో పవన్ మరోసారి తన సత్తాను చూపించాడని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మూడో రోజు ఏరియాల పరంగా చూస్తే నైజాంలో రూ.6.55 కోట్లు, సీడెడ్ లో రూ.2.2 కోట్లు, అలాగే నెల్లూరులో రూ.0.41కోట్లు, గుంటూరులో రూ.0.72 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 0.47 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.0.91 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా తెలంగాణ, ఆంధ్రాలో కలిపి చూస్తే మూడో రోజు రూ.13.15 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ మూవీ.
అయితే ఈ మూడు రోజులకు కలిపి గ్రాస్ కలెక్షన్లు చూసుకుంటే.. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, రెస్టాఫ్ ఇండియాను కలుపుకుని రూ.89.40 కోట్లు వచ్చాయి. అటు ఓవర్ సీస్ లో ఈ మూడు రోజు్లో రూ.20.60 కోట్లు వసూలు చేసింది భీమ్లానాయక్. మొత్తం రూ.110 కోట్లు ఇప్పటి వరకు గ్రాస్ కలెక్షన్నలను భీమ్లా నాయక్ రాబట్టాడు. ఇదే ఊపును ఇంకో వారం పాటు కొనసాగిస్తే మాత్రం.. రూ.200కోట్లు మార్క్‌ను భీమ్లానాయక్ అందుకుంటాడని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.