Mohan Babu and Mahesh Babu: ‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ సినిమాకు సంబంధించిన తాజాగా ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఏమిటి ఆ రూమర్ అంటే.. ఈ సినిమాలో మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషించనున్నాడట. మహేష్ కు మామయ్యగా చాలా వైవిధ్యంగా త్రివిక్రమ్, మోహన్ బాబు పాత్రను డిజైన్ చేశాడని ఓ పుకారు బాగా వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.

కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనుండటంతో.. ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఫిబ్రవరి నుంచి షూట్ ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అలాగే త్వరలోనే ఈ సినిమాలో నటించే మరో హీరోయిన్ ను కూడా అధికారికంగా రివీల్ చేయబోతున్నారు.
Also Read: అప్పటి ముచ్చట్లు : ఫామ్ లో ఉన్న హీరో కంటే.. కథనే ఫామ్ లోకి తెచ్చే హీరో కావాలి !

ఇక మహేష్ – త్రివిక్రమ్ కలయిక అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టు పదకొండు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండటం, పైగా మొదటసారి ఇద్దరు పాన్ ఇండియా సినిమా కలిసి చేస్తుండటం.. మొత్తానికి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నిటికీ మించి త్రివిక్రమ్ ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు, అటు మహేష్ కూడా వరుసగా సక్సెస్ లు అందుకున్నాడు. అందుకే ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: కలకలం: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై టీఆర్ఎస్ దాడి..
[…] ‘Konda’ Trailer: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా పేరు ‘కొండా’. తెలంగాణ రాజకీయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కొండా దంపతుల నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఈ ‘కొండా’ సినిమాను తీసుకురాబోతున్నాడు. కాగా 1980వ సంవత్సరం జరిగిన ఘటన ఆధారంగా కొండా సురేఖ, మురళి ప్రేమ కథకు కాస్త మసాలా యాడ్ చేసి ఈ సినిమాను చేస్తున్నాను అంటూ వర్మ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. […]