విజయ్ దేవరకొండపై రష్మిక హాట్ కామెంట్

రష్మిక మందన్నా.. ‘గీతా గోవిందం’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తీసి ఇక టాలీవుడ్ లో తిరుగులేకుండా మారింది. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్ లోనూ చాన్స్ దక్కించుకొని బిజీ హీరోయిన్ గా మారింది. తాజాగా ఆమె తన పుట్టిన సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న […]

Written By: NARESH, Updated On : April 28, 2021 9:37 pm
Follow us on

రష్మిక మందన్నా.. ‘గీతా గోవిందం’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తీసి ఇక టాలీవుడ్ లో తిరుగులేకుండా మారింది. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్ లోనూ చాన్స్ దక్కించుకొని బిజీ హీరోయిన్ గా మారింది.

తాజాగా ఆమె తన పుట్టిన సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఆమెకు అభిమానులంతా కలిసి ఒక ఉంగరాన్ని కానుకగా పంపారు. దాన్ని చూపించి పొంగిపోయింది. అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.

ఇక విజయ్ దేవరకొండతో ఎఫైర్ కొందరు ప్రశ్నలు అడిగారు. మీరు మళ్లీ విజయ్ తో నటిస్తారా? అని అడగ్గా ఈ ప్రవ్న విజయ్ నే అడగండి అని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఎవరైనా దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా కలిసి నటిస్తానని రష్మిక తెలిపింది.

ఇక ఇన్ని భాషల్లో నటిస్తున్న రష్మిక ఫేవరేట్ హీరో ఎవరంటే మాత్రం తప్పించుకుంది. నో కామెంట్ అని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నానని.. ఐపీఎల్ లో బెంగళూరు టీం తన ఫేవరెట్ అని తెలిపింది. తన సొంతూరే తన నంబర్ 1 ఫ్యామిలీ హాలీడే స్పాట్ అని తెలిపింది.