‘పోకిరి’కి పూరీ అనుకున్న పేరేంటో తెలుసా?

సినిమా ఇండ‌స్ట్రీలో కొన్ని చిత్రాలు ట్రేడ్ మార్కులా మిగిలిపోతాయి. అవి హీరోల జీవితాలను ఊహించని మలుపు తిప్పుతాయి. దర్శకులను అందలం మీద కూర్చోబెడతాయి. అలాంటి వాటిల్లో ఒక‌టి ‘పోకిరి’. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును తిరుగులేని స్టార్ గా మార్చిన ఈ సినిమా వ‌చ్చి నేటికి ప‌దిహేను సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం గురించి తెలియ‌ని ప‌లు విష‌యాలు తెలుసుకుందాం. ‘పోకిరి’ అనేది వాస్తవంగా నెగెటివ్ టైటిల్. అప్పటి వరకూ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి […]

Written By: Bhaskar, Updated On : April 28, 2021 9:30 pm
Follow us on

సినిమా ఇండ‌స్ట్రీలో కొన్ని చిత్రాలు ట్రేడ్ మార్కులా మిగిలిపోతాయి. అవి హీరోల జీవితాలను ఊహించని మలుపు తిప్పుతాయి. దర్శకులను అందలం మీద కూర్చోబెడతాయి. అలాంటి వాటిల్లో ఒక‌టి ‘పోకిరి’. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును తిరుగులేని స్టార్ గా మార్చిన ఈ సినిమా వ‌చ్చి నేటికి ప‌దిహేను సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం గురించి తెలియ‌ని ప‌లు విష‌యాలు తెలుసుకుందాం.

‘పోకిరి’ అనేది వాస్తవంగా నెగెటివ్ టైటిల్. అప్పటి వరకూ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి టైటిల్స్ పెద్ద‌గా ఎవ‌రూ పెట్ట‌లేద‌ని చెప్పొచ్చు. త‌న రూటే సెప‌రేట్ అంటూ దూసుకెళ్లే పూరీజ‌గ‌న్నాథ్.. మ‌హేష్ ను కూడా ఈ నెగెటివ్ టైటిల్ కు ఒప్పించాడు. అయితే.. నిజానికి ఈ చిత్రానికి పూరీ మొద‌ట అనుకున్న టైటిల్ వేరే! ఇంకా చెప్పాలంటే.. అస‌లు ఈ సినిమాలో అనుకున్న హీరో కూడా వేరే!

అవును.. ఈ సినిమా క‌థ‌ను ర‌వితేజ కోసం రాసుకున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. ఈ మూవీ ప‌ట్టాలెక్క‌డానికి ఐదేళ్ల ముందే ఈ స్టోరీని సిద్ధం చేసుకున్నాడ‌ట‌. ప‌లు ద‌ఫాలుగా మార్చుకుంటూ వ‌చ్చి.. ర‌వితేజ‌తో తీయాల‌ని అనుకున్నాడ‌ట‌. అప్పుడు ఈ చిత్రానికి అనుకున్న టైటిల్‌.. ‘‘ఉత్త‌మ్ సింగ్ స‌న్నాఫ్ సూర్య‌నారాయ‌ణ‌’’!

కానీ.. కార‌ణాలు అనేకం క‌దా. ఎలాగో ఈ స్టోరీ మ‌హేష్ వ‌ద్ద‌కు వెళ్లింది. ఆయ‌న‌కు స్టోరీ బాగా న‌చ్చేసింది. దీంతో.. టైటిల్ కూడా మారిపోయింది. ప్రిన్స్ గా చెలామ‌ణి అవుతున్న మ‌హేష్ బాబుకు.. సూప‌ర్ స్టార్ హోదాను స‌గ‌ర్వంగా అందించిన చిత్రం పోకిరి అని చెప్ప‌డంలో సందేహ‌మే లేదు. అప్ప‌టి వ‌ర‌కూ మ‌హేష్ కెరీర్లో ప‌లు హిట్లు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న్ను టాప్ స్టార్ గా మార్చింది మాత్రం ఈ సినిమానే!

ఆ రోజుల్లో ఈ సినిమా సాధించిన క‌లెక్ష‌న్స్ చూసి ఇండ‌స్ట్రీ మొత్తం నివ్వెర పోయింది. ఏకంగా 40 కోట్ల షేర్ సాధించింది ఔరా అనిపించింది. ఇంత‌టి క‌లెక్ష‌న్ సాధించిన మొద‌టి సినిమాగా నిలిచింది పోకిరి. ఈ సినిమాతో మ‌హేష్ స్టార్ హీరోగా మారిపోతే.. పూరీ స్టార్ డైరెక్ట‌ర్ గా స్థిర‌ప‌డిపోయాడు.