
Rashmi- Sudigali Sudheer: బిగ్ బాస్ తెలుగు 6 అట్టర్ ప్లాప్. ముఖాలు తెలియని కంటెస్టెంట్స్, కొత్తదనం లేని టాస్క్స్, ఫైర్ లేని కంటెస్టెంట్స్, రంజింప చేయని నాగార్జున హోస్టింగ్. మొత్తంగా సీజన్ 6 ప్రేక్షకులను నిరాశ పరిచింది. షోకి వచ్చిన టీఆర్పీనే అందుకు నిదర్శనం. వీక్ ఎపిసోడ్స్ లో 2-3 టీఆర్పీ రాబట్టిన షో… నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ లో కూడా పుంజుకునేది కాదు. వీక్ డేస్ కి వీక్ ఆఫ్స్ కి తేడా లేకుండా పోయింది. నాగార్జున హోస్టింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కంటెస్టెంట్స్ ని ఆయన జడ్జి చేసిన విధానం కూడా బాలేదన్న విమర్శలు వినిపించాయి.
Also Read: Unstoppable with NBK -Pawan : అన్నయ్య చిరంజీవిలో నాకు నచ్చనివి ఇవే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 6 నిర్వాహకులకు ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. సీజన్ 7 సక్సెస్ చేయకపోతే ప్రాంచైజీ వదులుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ఛానల్ కి కోట్లు తెచ్చి పెట్టే బిగ్ బాస్ షోని వదులుకోవడానికి స్టార్ మా సిద్ధంగా లేదు. అందుకే ఎన్ని విమర్శలు, చట్టపరమైన చిక్కులు వచ్చినా ఆపకుండా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ కంటెస్టెంట్స్ ని దింపాలి అంటుకుంటున్నారట.
నిర్వాహకుల హిట్ లిస్ట్ లో యాంకర్ రష్మీ గౌతమ్ ఉన్నారట. బుల్లితెర ఆడియన్స్ లో భారీ ఫేమ్ ఉన్న ఆమెను లాక్ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. రష్మీ కనుక ఒప్పుకుంటే షో సగం సక్సెస్ అయినట్లే అంటున్నారు. ఆమె గ్లామర్, ఆట తీరు షోకి చాలా ప్లస్ అవుతుంది. ఆమె కోసమే చూసే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు. భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఒప్పించాలని చూస్తున్నారట. రష్మీ టాప్ యాంకర్స్ లో ఒకరు. ఆమె చేతిలో మూడు నాలుగు షోలు ఉన్నాయి. ప్రమోషన్స్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు.

రష్మీ ఒప్పుకోవాలంటే పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయాల్సి ఉంటుంది. రష్మీ ఓకే చెబితే సుడిగాలి సుధీర్ ని కూడా టార్గెట్ చేయాలి అనుకుంటున్నారట. బుల్లితెర లవర్స్ గా ఫేమ్ తెచ్చుకున్న సుధీర్-రష్మీలను గనుక హౌస్లోకి పంపితే టీఆర్పీ బాక్సులు బద్దలై పోవడం ఖాయం. రూమర్డ్ లవర్స్ గా ఉన్న సుధీర్, రష్మీ కెమెరాల ముందు రియల్ రొమాన్స్ చేసేలా చేస్తే… ఆడియన్స్ పిచ్చ కిక్ ఫీల్ అవుతారు. అది అసాధ్యమేమీ కాదు. వారికి కావాల్సిన రెమ్యూనరేషన్ ఇస్తే వచ్చేస్తారని నిర్వాహకులు భావిస్తున్నారట. కాబట్టి బిగ్ సీజన్ 7లో రష్మీని చూడొచ్చు అంటున్నారు. ఇక నిర్వాహకుల ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తే… రష్మీతో పాటు సుధీర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని అంటున్నారు.
Also Read:Amigos Overseas Review: అమిగోస్’ ఓవర్సీస్ రివ్యూ: కళ్యాణ్ రామ్ మూవీ టాక్ ఏంటంటే?
