Rashmi Gautam Marriage: ఎక్స్ క్లూజివ్ : ‘రష్మీ గౌతమ్’ కి పెళ్లి అయిపోయింది.. మరి ఎందుకు దాచింది ?
Rashmi Gautam Marriage: యాంకర్ రష్మీ గౌతమ్ కి పెళ్లి అయిపోయింది. లాక్ డౌన్ లో రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకుని, హైదరాబాద్ లో కాపురం కూడా పెట్టింది. ఓకేతెలుగు.కామ్ కి అందిన ఎక్స్ క్లూజివ్ సమాచారం ప్రకారం రష్మీ గౌతమ్ ప్రస్తుతం తన భర్తతోనే కలిసి ఉంటుంది. అయితే, ఆమె భర్తకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే, రష్మీ భర్త సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి అని, అతను ఓ ప్రైవేట్ […]
Rashmi Gautam Marriage: యాంకర్ రష్మీ గౌతమ్ కి పెళ్లి అయిపోయింది. లాక్ డౌన్ లో రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకుని, హైదరాబాద్ లో కాపురం కూడా పెట్టింది. ఓకేతెలుగు.కామ్ కి అందిన ఎక్స్ క్లూజివ్ సమాచారం ప్రకారం రష్మీ గౌతమ్ ప్రస్తుతం తన భర్తతోనే కలిసి ఉంటుంది. అయితే, ఆమె భర్తకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే, రష్మీ భర్త సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి అని, అతను ఓ ప్రైవేట్ సంస్థలో మేనేజర్ అని తెలుస్తోంది.
Rashmi Gautam Marriage
ఇంతకీ రష్మీ గౌతమ్ సీక్రెట్ గా ఎందుకు పెళ్లాడింది..? సరే.. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా.. నెలలు గడుస్తున్నా.. ఇంకా ఎందుకు ఆమె తన పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది ? అయినా ఫామ్ లో ఉన్న హీరోయిన్సే పెళ్లి అయితే, తమకు పెళ్లి అయిందని ఓపెన్ గా చెప్పేస్తున్న కాలం ఇది. అలాంటిది.. యాంకర్ అయిన రష్మీ గౌతమ్ మాత్రం తన పెళ్లిని ఇంకా సీక్రెట్ గానే ఉంచింది. నిజానికి హీరోయిన్ గా రష్మీ గౌతమ్ కి ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేవు.
పైగా రష్మీ గౌతమ్ బుల్లితెరకే పరిమితం అయింది. ఇక బుల్లితెరకు పెళ్లి అయినా ఒక్కటే, కాకపోయినా ఒక్కటే. అక్కడ పెద్ద కండిషన్స్ కూడా ఏమి ఉండవు. ఆ మాటకొస్తే.. బులితెర పై పెళ్లి అయిన భామలే బాగా రాణిస్తారు. అయినా జనరేషన్ మారింది. ఇప్పుడు పెళ్లయిన భామలకు కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. అనసూయ కూడా పెళ్లి అయ్యాకే యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. మరి తన పెళ్లిని దాచాల్సిన అవసరం రష్మీ గౌతమ్ కి ఎందుకొచ్చిందో !!
Rashmi Gautam
రష్మీ గౌతమ్ త్వరలోనే తన పెళ్లి విషయం పై క్లారిటీ ఇస్తే బెటర్.. పుకార్లకు ఊతమివ్వకుండా ఉన్నట్టు ఉంటుంది. మరోపక్క రష్మీ గౌతమ్ – సుధీర్ గురించి సోషల్ మీడియాలో ప్రేమ జంట అంటూ రచ్చ జరుగుతూనే ఉంది. ఏది ఏమైనా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి యాంకర్ గా మారి, చిన్నాచితకా చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ‘రష్మీ గౌతమ్’ ‘భోళా శంకర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా నటించబోతుంది.
‘భోళా శంకర్’ సినిమాలో రష్మీ గౌతమ్ ది ఐదు సెకన్లు కనిపించే ఒక ఐటమ్ పాత్ర అట. ఐటెం సాంగ్ కి లీడ్ గా వచ్చే కోరస్ పాడుతూ రష్మీ గౌతమ్ కనిపించనుందట. ఈ లెక్కన కోరస్ లో వచ్చే ఐటమ్ భామను ఎవరు పట్టించుకుంటారు ? మరి మెగాస్టార్ సినిమా ‘రష్మీ గౌతమ్’కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.