Mudragada letter to YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు ఇటీవల ఓటీఎస్ పై ఓ నిర్ణయం తీసుకుంది. కాగా, ఓటీఎస్ కింద పేదలు డబ్బులు కట్టి ఇళ్లు రెగ్యులరైజ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కాగా, ఈ స్కీమ్ పైన బోలెడన్ని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మ నాభం ఓటీఎస్ విధానంపైన జగన్ సర్కారును ప్రశ్నిస్తూ బహిరంగం లేఖ రాశారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దంటూ కోరారు.
గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేయడం ఇప్పటి వరకు జరగలేదని, పేద వారి ఇళ్లకు ఇచ్చిన అప్పును కట్టాలని ఇప్పటి వరకు ఏ ప్రజా ప్రతినిధి అడగలేదని వివరించారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు. గత ప్రభుత్వాలు పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం ఎక్కడిది అని ముద్రగడ ప్రశ్నించారు.
Also Read: చంద్రబాబు చాణక్యం.. టీడీపీ చేతిలోకి మరో అస్త్రం.. ఈ సారి విక్టరీ గ్యారెంటీ..!
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. ఓటీఎస్ విధానంపైన విమర్శలు వస్తున్నాయి. అయితే, జగన్ సర్కారు ఆ విషయాలను పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఓటీఎస్ గురించి చర్చ కూడా జరుగుతున్నది. ఓటీఎస్ కింద పేదలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలు చెల్లించాలని ప్రభుత్వం చెప్తోంది. వాయిదాల పద్ధతిలోనైనా కట్టాలని చెప్తోంది. అయితే, అలా ఓటీఎస్ వసూలుకు సిబ్బంది పేదల ఇళ్లపైకి వెళ్తున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నది.
పలు వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. డబ్బులు కట్టలేమని పేదలు ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం దయ తలచడం లేదు. ఓ వైపు ఓటీఎస్ స్వచ్ఛందమని పేర్కొంటూనే మరో వైపున డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంపైన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది చేత డబ్బులు వసూలు చేపించే పద్ధతిని ప్రభుత్వం ఫాలో కావడం సరికాదని అభిప్రాయపడుతున్నారు జనాలు.
Also Read: టీడీపీకి ఆయుధం దొరికినట్టేనా? మరి మంత్రి కొడాలి నాని పరిస్థితి ఏంటి?